రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన డ్రైవర్.. రూ. 10 కోట్ల జాక్ పాట్
అదృష్టం ఎప్పుడు ఎవరి జీవితాన్ని ఎలా మారుస్తుందో ఊహించలేం.. తాజాగా ఓ డ్రైవర్ ను అదృష్టం వరించింది. ఒక్క రాత్రిలోనే అతడు కోట్లకు అధిపతి అయ్యాడు. దీంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ ఘటన హరియాణాలోని సిర్సా జిల్లా మహ్మద్ పురియా జిల్లాలో జరిగింది. పేదింట్లో ఆనందం వెల్లివిరిసిన నేపథ్యంలో గ్రామస్థులు సంబరాలు చేసుకుంటున్నారు.
హరియాణాలోని సిర్సా జిల్లా మహ్మద్ పురియా గ్రామానికి చెందిన 35 ఏళ్ల పృథ్వీ సింగ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతనిది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పృథ్వీ సింగ్ భార్య సుమన్ రాణి పాఠశాలలో ప్యూన్ గా పనిచేస్తోంది. అయితే ఇటీవల పృథ్వీ రూ. 500 తో టికెట్ కొనుగోలు చేశాడు. అయితే పంజాబ్ లోహ్రీ మకర్ సంక్రాంతి 2026 బంపర్ లాటరీ లో మొదటి బహుమతిగా రూ. 10 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో రాత్రికి రాత్రే పృథ్వీ సింగ్ కోటీశ్వరుడయ్యాడు. దీంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. పేదింటిలో ఆనందం వెల్లివిరిసిందంటూ పృథ్వీ సింగ్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే విషయంపై పృథ్వీ సింగ్ మాట్లాడుతూ.. ఆనందం వ్యక్తం చేశాడు. మూడో ప్రయత్నంలో లాటరీ తగలడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నాడు. రూ. 500 పెట్టి లాటరీ కొనుగోలు చేస్తే రూ. 10 కోట్లు దక్కాయని తెలిపాడు. అలాగే లాటరీ రూపంలో వచ్చిన నగదును పిల్లల భవిష్యత్తు కోసం వినియోగిస్తామని వివరించాడు. ఇక తనకు పెద్ద లగ్జరీ కారు కొనుగోలు చేయాలని ఉందని ఆరేళ్ల పృథ్వీ కొడుకు తన కోరికను బయటపెట్టాడు. పృథ్వీ లాటరీ గెలిచినందుకు సంతోషంగా ఉందని అతడి భార్య పేర్కొంది. మరోవైపు పృథ్వీ సింగ్ రూ. 10 కోట్లు లాటరీ గెలిచిన విషయం తెలిసిన తర్వాత అతడి ఇంటికి వందలాది మంది తరలివస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications