శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. భద్రతాసిబ్బంది వాహనంపై దాడి చేసి కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు జవాన్లు గాయాలపాలయ్యారు. అనంత్‌నాగ్ జిల్లాలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం అనంత్‌నాగ్‌లోని లాజిబల్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో.. ముష్కరులు అక్కడి నుంచి పారిపోయారు.

ఈ ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. దాడుల నేపథ్యంలో ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతమంతా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!