వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రచారంపై ఫొని ఎఫెక్ట్...సభలు రద్దు చేసుకున్న దీదీ, మోడీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రచారంపై ఫొని ఎఫెక్ట్... సభలు రద్దు చేసుకున్న దీదీ, మోడీ || Oneindia Telugu

కోల్‌కతా : ఫొని తుఫాను బెంగాల్‌ను గజగజ వణికిస్తోంది. తుఫాను ఒడిశా నుంచి బెంగాల్ వైపు దూసుకొస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ఫొని ఎఫెక్ట్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంపైనా పడింది. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో నేతలు సభలు రద్దు చేసుకున్నారు. ఫొని ప్రభావంపై దృష్టి పెట్టారు.

ఫణి తుఫాను ప్రభావం .. అప్రమత్తమైన పశ్చిమ బెంగాల్ .. పర్యాటకులు వదిలివెళ్లాలని ఆదేశంఫణి తుఫాను ప్రభావం .. అప్రమత్తమైన పశ్చిమ బెంగాల్ .. పర్యాటకులు వదిలివెళ్లాలని ఆదేశం

48గంటలు ప్రచారానికి దూరం

48గంటలు ప్రచారానికి దూరం

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫొని తుఫాను కారణంగా రెండు రోజుల పాటు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. 48 గంటల పాటు ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరాదని నిర్ణయించుకున్నారు. బెంగాల్‌పై తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశముండటంతో ఆమె నిరంతరం పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఖరగ్‌పూర్‌ వెళ్లి నుంచి స్వయంగా పరిస్థితులను పరిశీలిస్తున్నారు. మమతా బెనర్జీ శుక్రవారం మిడ్నాపూర్‌లో ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నా ఆ సభను రద్దు చేసుకున్నారు.

మోడీ షెడ్యూల్‌లో మార్పు

మోడీ షెడ్యూల్‌లో మార్పు

ఫొని కారణంగా ప్రధాని నరేంద్రమోడీ సైతం తన ప్రచార షెడ్యూల్‌లో మార్పు చేసుకున్నారు. శుక్రవారం జార్ఖండ్‌లో జరిగే సభలో పాల్గొనాల్సి ఉండగా.. దాన్ని శనివారానికి వాయిదా వేసుకున్నారు. వర్షాల కారణంగా జంషెడ్‌పూర్‌లో యోగి ఆదిత్యనాథ్ ర్యాలీ క్యాన్సిల్ అయింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సైతం జార్ఖండ్‌లో మూడు సభల్లో పాల్గొనాల్సి ఉండగా... వాతావరణం అనుకూలించని కారణంగా రద్దు చేసుకున్నారు.

విమాన రాకపోకలకు అంతరాయం

విమాన రాకపోకలకు అంతరాయం


ప్రతికూల వాతావరణం కారణంగా కోల్‌కతా ఎయిర్‌పోర్టు తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. శుక్రవారం మ.3గం. నుంచి శనివారం ఉ. 8గం. వరకు విమానాల రాకపోకలను అనుమతించమని స్పష్టంచేశారు. హౌరా స్టేషన్‌ నుంచి నడవాల్సిన 233 ట్రైన్లను రద్దు చేశారు. ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతంలో పరిస్థితిని నేవీ ఏరియల్ సర్వే ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తోంది.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee cancelled her campaign rallies for the next 48 hours as Cyclone Fani is expected to impact West Bengal today. The Chief Minister will be in the coastal belt of Kharagpur and personally monitor the situation. The Chief Minister was scheduled to address rally in Medinipur today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X