వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెత్తంతో పని చేయిస్తా... అధికారిపై బురద కేసులో ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో ప్రభుత్వ ఇంజనీర్ ఇంజనీర్ పై బురద బోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రాణే తాను చేసిన పనిని సమర్థించుకున్నాడు. అలా చేయడం తన కర్తవ్యంగా పేర్కోన్నాడు. రోడ్డు పర్యవేక్షణను ఎల్లప్పుడు చేస్తానని , ఈనేపథ్యంలోనే కర్ర పట్టుకుని అధికారులతో పని చేయించుకోవడం ఎమ్మెల్యేగా తన భాద్యత అంటూ తాను చేసిన చర్యపై స్పందించాడు.

 అధికారులతో పని చేయించుకోవడ నా భాద్యత

అధికారులతో పని చేయించుకోవడ నా భాద్యత

ఈనేపథ్యంలోనే రోడ్డు నిర్మాణం కోసం ప్రజలు భూమిని ఇచ్చారని అయితే రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించిందని ,రోడ్డును నాణ్యతగా నిర్మించుకోవడం తాన భాద్యత అని అన్నారు. దీంతోపాటు అధికారులు చాల గర్వంగా వ్యవహరించారిని వారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.రోడ్డు నిర్మాణ పనులను ప్రాపర్‌గా చేపట్టాలని ,ఇందుకోసం తాను నిరంతరం పర్యవేక్షణ చేస్తానని అన్నారు.. ఈ విషయంలో వ్వక్తిగతంగా ఎలాంటీ ఇబ్బందులైన ఎదుర్కోంటానని అన్నారు..

జరిగిన సంఘటనపై క్షమాపణ అడుగుతాను ఎమ్మెల్యే తండ్రి

జరిగిన సంఘటనపై క్షమాపణ అడుగుతాను ఎమ్మెల్యే తండ్రి

కాగా ఎమ్మెల్యే చేతిలో అవమానానికి గురైన ఇంజనీర్ అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పిర్యాధు చేశాడు. దీంతో ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు..కాగా నితేశ్ రానే తండ్రి మహారాష్ట్ర మాజీ సీఎం కాగా ప్రస్థుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు దీంతో ఘటనపై ఆయన స్పందించాడు.. అధికారిపై దాడులు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అయితే రోడ్డు సమస్య కూడ ఉందని తెలిపిన ఆయన నితేశ్ రానే తన కొడుకని అలాంటప్పుడు జరిగిన సంఘటనపై క్షమాపణ ఎందుకు అడగనంటూ రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. జరిగిన సంఘటనపై తండ్రిగా క్షమాపణ కోరుతున్నప్పుడు కోడుకుగా ఉన్న నితీశ్ క్షమపణ చెబుతాడని అన్నాడు.

జరిగిన సంఘటన

జరిగిన సంఘటన

మహారాష్ట్రలోని కంకావళి అనే ప్రాంతంలో నిర్మితమవుతున్న ముంబై గోవా హైవే పై గుంతలు పడి, రోడ్డంతా బురదమయంగా మారింది..దీంతో ఆ రోడ్డును పరీశీలించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రాణే వెళ్లాడు.. ఎమ్మెల్యేతోపాటు హైవే పర్యవేక్షక ఇంజనీర్ అయిన ప్రకాశ్ షెడ్కర్ కూడ ఉన్నాడు.. పర్యవేక్షణలో భాగంగా ఎమ్మెల్యే నితేష్ సదరు ఇంజనీర్ పై ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ఈనేపథ్యంలోనే ఆయనను తన అనుచరుల ముందే నెట్టివేసే ప్రయత్నం చేశాడు...ఇక ఓ వైపు ఎమ్మెల్యే ఇంజనీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగానే మరోవైపు ఎమ్మెల్యే అనుచరులు ఇంజనీర్ పై బకెట్లలో నింపిన బురద నీటిని గుమ్మరించారు..ఇలా రెండు బకెట్లతో ఇంజనీర్‌పై పోశారు....ఇక బురద నీరు పోయడమే కాకుండా ఇంజనీర్‌ను తాళ్లతో కట్టివేశారు.

English summary
Mharashtra Congress MLA Nitesh Rane, who took law into his hands and dumped mud on a government officer over bad condition of a road, has justified his act and said that it was his duty and he will continue to monitor work on the road "with a stick in hand"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X