అనంత్ నాగ్ అడవుల్లో ఉగ్రవాదుల రహస్య స్థావరాలు.. జల్లెడ పడుతున్న ఎన్ఐఏ
రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన బాంబు దాడి ఘటన దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. 2025 నవంబర్ 10వ తేదీన మొదటి ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ సమీపంలో పార్క్ చేసిన ఒక కారులో భారీ పేలుడు సంభవించడంతో 15 మంది మృతి చెందారు. ఇక ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఉగ్రవాదుల వేట మొదలు పెట్టింది.
అనంత్ నాగ్ అటవీ ప్రాంతంలో సోదాలు
ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉగ్ర మూక ఉందని గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ అనంత నాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది.

ఆ రహస్య స్థావరాలను గురించి చెప్పిన నిందితులు
ఈ ఉగ్ర కుట్ర కేసులో అరెస్ట్ అయిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ నిందితులు డాక్టర్ అదిల్ అహ్మద్, యాసిర్ బిలాల్ లను ఎన్ఐఏ అధికారులు పోలీసుల సహకారంతో అనంత్ నాగ్ కు తీసుకువెళ్లారు. అయితే అక్కడ మట్టన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందే పలు రహస్య స్థావరాల గురించి వారు అధికారులకు వివరించినట్లు సమాచారం.
వివిధ ప్రదేశాలలో గాలింపు చర్యలు
నిందితుల నుంచి లభించిన ఆధారాలతో ఆ అటవీ ప్రాంతంలో కొన్ని వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న మరికొందరిని అదుపులోకి తీసుకునేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, స్థానిక పోలీసుల మద్దతుతో జమ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రదేశాలలో గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేయటం లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఢిల్లీ కారు బాంబు దాడి కేసును చాలా సీరియస్ గా తీసుకుంటుంది.
ఏడుగురికిపైగా నిందితుల అరెస్టు
ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు ఏడుగురికి పైగా నిందితులను అరెస్టు చేసింది. అరెస్ట్ అయిన నిందితులను ఢిల్లీ కోర్టు ఎన్ఐఏ కి కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిందితుల నుండి రాబట్టిన సమాచారంతో నగదు విదేశీ కరెన్సీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications