వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ఐఎస్ఐ మహిళలతో భారత్ పురుషులకు వల

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్ పురుషులను ఆకట్టుకోవడానికి పాకిస్థాన్ కు చెందిన మహిళలను పావులుగా వాడుకుంటున్నదని వెలుగు చూసింది. ఇప్పటికే ఈ విదంగా మహిళా ఐఎస్ఐ ఏజెంట్లు వల వేసి భారత్ కు చెందిన ఇద్దరు పురుషులను లొంగదీసుకున్నారని వెలుగు చూసింది.

సోషల్ మీడియా ద్వారా ఈ మహిళా గూఢచారులను భారత్ మహిళల పేర్లు పెట్టి రంగంలోకి దించుతున్నారని భారత్ నిఘా వర్గాలు ఆదారాలు సేకరించారు. 2014 ఆగస్టు నుంచి నవంబర్ నెల మద్య కాలంలో ఫిరోజ్ పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఇద్దరు నిందితులు మద్యప్రదేశ్ లోని బోపాల్ జిల్లాకు చెందిన శివ్ నారాయణ్ చంద్రవంశం (43), అర్జున్ మాలవ్య (35) అని అధికారులు గుర్తించారు. విచారణలో వీరిద్దరూ వెల్లడించిన విషయాలు తెలుసుకున్న అధికారులు షాక్ కు గురైనారు.

Pakistan woman spies use Indian names to connect with the Indian men

సోషల్ మీడియా ద్వారా తాము ఐఎస్ఐ మహిళా గూఢచారుల వలలో పడ్డామని అంగీకరించారు. అరెస్టు అయిన ఇద్దరూ భారతీయులు కావడంతో ఆ అనుమానాలకు మరింత బలాన్నిచ్చిందని అధికారులు అంటున్నారు.

ఆ మహిళా ఐఎస్ఐ ఏజెంట్ పేరు జయ మిశ్రా (అసలు పేరు వేరే ఉంది) అని వెలుగు చూసింది. ఈమె లాహోర్ లో ఓ క్లినిక్ నిర్వహిస్తున్నదని అధికారుల విచారణలో వెలుగు చూసింది. నల్లతేళ్లతో తయారు చేసిన ఔషదాలు సమాజసేవ కోసం ఆమె ఉపయోగిస్తున్నదని అధికారులు తెలిపారు.

జయ మిశ్రా అనే మహిళా ఏజెంట్ వీరిద్దరిని విడివిడిగా ట్రాప్ చేసిందని అధికారులు అన్నారు. తరువాత ఇండో-పాక్ సరిహద్దు చెక్ పోస్టు దగ్గరలోని గుస్సేన్ వాలా ప్రాంతంలో మహిళా గూఢచారులు రెండు సార్లు పరిశీలించారని అధికారులు చెప్పారు.

గతంలో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో నేపాల్ ఐఎస్ఐ ప్రయోగ కేంద్రాల నుంచి మహిళా ఏజెంట్లను భారత్ లోకి పంపించారని సమాచారం. నరేంద్ర మోడీ పరిపాలనపై, ఇతర లక్షాలను టార్గెట్ చేసుకుని ఐఎస్ఐ తన కార్యకలాపాలు నిర్వహించాలని ప్రయత్నించింది.

English summary
The woman spies use Indian names to connect with the Indian men on social media. In the recent past, two such cases have come to light.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X