వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రతన్ టాటాపై స్వామి షాకింగ్ కామెంట్లు, అందుకే సైరస్ మిస్త్రీపై అసూయ

|
Google Oneindia TeluguNews

ముంబై: టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా పైన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గురువారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టాటాల చరిత్రలోనే అత్యంత అవినీతిమయమైన చైర్మన్ రతన్ టాటా అని దుయ్యబట్టారు.

రాయ్‌పూర్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి రతన్‌ టాటా అసలు టాటా వారసుడు కాదని, ఆయన తండ్రే ఓ దత్తపుత్రుడన్నారు. సైరస్‌ మిస్త్రీ వ్యవహారంలో రతన్‌ టాటా అన్యాయంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

సైరస్ మిస్త్రీ తర్వాత..: టాటా సన్స్ రేసులో 'తమిళ' తెలుగువాడు రామాదురై సైరస్ మిస్త్రీ తర్వాత..: టాటా సన్స్ రేసులో 'తమిళ' తెలుగువాడు రామాదురై

Ratan Tata most corrupt chairman in Tata history: Subramanian Swamy

రెండు నెలల సైరస్ క్రితం మిస్త్రీ పనితీరును బోర్డు ప్రశంసించిందని, అదే అతనిపై రతన్ టాటా అసూయకు కారణమన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ కుంభకోణం, ఎయిర్‌ ఏసియా స్కామ్‌, విస్తారా భాగస్వామ్య వ్యవహారం వంటి అంశాల్లో టాటా ప్రమేయం ఉందని ఆరోపించారు.

వీటినుంచి తప్పించుకోవడానికే ఆయన సైరస్ మిస్త్రీని తప్పించారన్నారు. కానీ ఓసారి న్యాయవిచారణ ప్రారంభమైతే ఆయన తప్పించుకోలేరన్నారు. ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని, విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయాలన్నారు. దీనిపై ప్రధాని మోడీకి లేఖ రాశానని చెప్పారు.

English summary
BJP Rajya Sabha MP Subramanian Swamy has described Ratan Tata as the most corrupt chairman in the history of the Tata group.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X