వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Surya Grahan 2022: ఎల్లుండే..: గ్రహణకాలంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శనివారం సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సంవత్సరంలో ఇదే తొలి సూర్యగ్రహణం. శని అమావాస్య నాడు సూర్యగ్రహణం సంభవిస్తుండటాన్ని హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం.. అశుభంగా పరిగణిస్తోన్నారు పండితులు. వైశాఖ మాసం కృష్ణ పక్షపు అమావాస్య రోజు నాడు సూర్యగ్రహణం ఏర్పడటం అరుదుగా సంభవిస్తుంటుందని, దీని ప్రభావం కొన్ని రాశులపై ఉంటుందని సూచిస్తోన్నారు. హిందూ ధర్మశాస్త్రాల్లో అమావాస్య, శనివారానికి చాలా ప్రాధాన్యత ఉంది.

శని అమావాస్య నాడే..

శని అమావాస్య నాడే..

ఆ రోజును శని అమావాస్య లేదా శనిశ్చరీ అమావాస్యగా పిలుస్తుంటారు. అలాంటి రోజే సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఇది పాక్షికమే అయినప్పటికీ.. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. భారత్‌లో ఈ సూర్యగ్రహణం అర్ధరాత్రి 12:15 నిమిషాలకు ఆరంభమౌతుంది. సుమారు నాలుగు గంటల పాటు కొనసాగుతుంది. తెల్లవారు జామున 4:07 నిమిషాలకు ముగుస్తుంది.

కనిపించే ప్రాంతాలివే..

కనిపించే ప్రాంతాలివే..


భారత్‌లో ఈ సూర్యగ్రహణం కనిపించదు. అమెరికా దక్షిణ ప్రాంతం, అంటార్కిటికా, దక్షిణ- పసిఫిక్ సముద్ర తీర ప్రాంత దేశాల ప్రజలు మాత్రమే ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే పశ్చిమ ప్రాంతం, బొలీవియ నైరుతి ప్రాంతం, పెరూ ఈశాన్య ప్రాంతం, బ్రెజిల్ ఆగ్రేయ ప్రాంత ప్రజలు మాత్రమే దీన్ని చూడగలరని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా తెలిపింది. నాసా తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో దీన్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది.

గ్రహణ కాలంలో చేయాల్సినవి..

గ్రహణ కాలంలో చేయాల్సినవి..

సూర్య, చంద్రగ్రహణాలనేవి పంచాంగంతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల- దాన్ని అనుసరిస్తూ కొన్ని నియమ, నిబంధనలను రూపొందించారు పండితులు. వాటిని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. గ్రహణ కాలాన్ని సూతక సమయంగా భావించాలి. గ్రహణ సమయం ఆరంభమైన వెంటనే- మహా శివుడికి సంబంధించిన మంత్రాలను ఉచ్ఛరిస్తూ ఉండాలి. గ్రహణ కాలం ముగిసేంత వరకూ జపించాలి.

ఆభ్యంగన స్నానం తప్పనిసరి..

ఆభ్యంగన స్నానం తప్పనిసరి..

గ్రహణం పూర్తిగా ముగిసిన వెంటనే ప్రక్షాళన ఆరంభించాలి. తొలుత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గంగాజలం లేదా పసుపు చల్లిన నీటిని చల్లాలి. ఆభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. నదీ స్నానం ఇంకా శ్రేష్ఠమైనదని పెద్దలు చెబుతుంటారు. దేవుళ్ల పటాలను తుడిచి దీపారాధన చేయాలి. పూజలు నిర్వహించాలి. ఏదైనా గుడికి వెళ్లడం మంచిదని పండితులు, పెద్దలు సూచిస్తుంటారు. అప్పుడే సూతక సమయం ముగిసినట్టుగా భావిస్తారు.

 చేయకూడనివి..

చేయకూడనివి..


గ్రహణ సమయంలో మంచినీటిని కూడా ముట్టకూడదనే నియమం ఉంది. ఎలాంటి ఆహారాన్ని స్వీకరించకూడదు. వంట కూడా వండకూడదు. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదు. ఇది కంటి చూపును దెబ్బ తీస్తుంది. ఫిల్టర్ పేపర్‌తో అమర్చిన కళ్లద్దాలను ధరించి చూడవచ్చు. సన్ గ్లాసులు, స్మోక్డ్ గ్లాసులు, ఎక్స్‌రే ఫిల్మ్, నెగెటివ్ ఫిల్మ్‌ల గుండా సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. గ్రహణ కాలంలో నిద్రించకూడదు.

English summary
Surya Grahanam 2022: Dos and don’ts to follow this Solar Eclipse. This time the solar eclipse will start on 30th April at 12:15 pm and will end the next day at 04:07 am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X