పెరంబూర్ లో విజయ్ కు బిగ్ బాస్ బ్యూటీ షాాక్ ? ప్రచారానికి దిగకముందే..!
తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న టీవీకే అధినేత, హీరో విజయ్ (Vijay) రెండు చోట్ల పోటీ చేయాలని కూడా నిర్ణయంచారు. ఇందులో పెరంబూర్ నియోజకవర్గం కూడా ఒకటి. అయితే ఇక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న విజయ్ కు బిగ్ బాస్ బ్యూటీ షాకిచ్చింది. విజయ్ కంటే ముందే ఇక్కడ ప్రచారంలోకి దిగిన సదరు బ్యూటీ పంచ్ డైలాగ్ లు మొదలుపెట్టేసింది.
పెరంబూర్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభం కాకముందే బిగ్ బాస్ జూలీ ("Bigg Boss" Julie) ఆయనకు వ్యతిరేకంగా రంగంలోకి దిగిపోయింది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 సీట్లలో ఒంటరిగా బరిలోగి దిగుతున్న విజయ్.. పెరంబూర్ లో ఎట్టి పరిస్ధితుల్లో గెలిచేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఊహించని మలుపు ఎదురైంది. బిగ్ బాస్ జూలీ విజయ్‌కు వ్యతిరేకంగా నేరుగా ప్రచారం మొదలుపెట్టారు.

పెరంబూరు నియోజకవర్గంలో విజయ్ ప్రచారానికి రాకముందే, "నేను ఇప్పటికే ప్రారంభించాను" అంటూ ఓ వీడియో విడుదల చేశారు. "నువ్వు రేపు వస్తున్నావు, నేను ఇవాళే మొదలుపెట్టేశా అన్నయ్య... రా చూసుకుందాం" అనే ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గత కొన్ని నెలలుగా జూలీ.. విజయ్, ఆయన పార్టీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ విమర్శలు వీడియోల రూపంలో వెలుగులోకి రాగా, ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలో వ్యతిరేక స్వరం వినిపించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది.

ஆரம்பிச்சுட்டனே பெரம்பூரிலிருந்து 😎#dmk #julie #tvk pic.twitter.com/a8rMaSWHMh
— Mariajuliana_official (@iMariaJuliana) March 29, 2026
ఈ వీడియో తర్వాత విజయ్ ఫ్యాన్స్ భారీగా జూలీపై విమర్శలకు దిగుతున్నారు. జూలీ అనవసరంగా వివాదం సృష్టిస్తున్నారా?", "ప్రచారం కోసం దీన్ని వాడుకుంటున్నారా?" వంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. కొందరు జూలీని నేరుగా విమర్శిస్తూ వ్యాఖ్యలు పోస్ట్ చేస్తుండగా, మరికొందరు ఇది ప్రజాస్వామ్యంలో సహజమైన విషయమని వాదిస్తున్నారు. మరోవైపు విజయ్ తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మొదటి ఎన్నికలోనే ఇలాంటి ప్రత్యక్ష వ్యతిరేకతను ఎదుర్కొనడం, ఈ ఎన్నికలు ఎంత కఠినంగా ఉంటాయో సూచిస్తుంది. అదే సమయంలో.
-
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
తమిళనాట కొత్త లెక్కలు, సైలెంట్ సపోర్ట్ - సంచలనం ఖాయం..ప్రముఖ సర్వే రిపోర్ట్..!! -
Tamil nadu BJP First List: 27మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్-అన్నామలైకి షాక్..! -
Tamil Nadu Election: ఒక్కో అఫిడవిట్లో ఒకలా- చిక్కుల్లో విజయ్ ? పోటీపై అనర్హత? -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
Kerala Survey: కేరళలో గెలిచేది వాళ్లే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తమిళనాడుకు తదుపరి సీఎం నేనే: త్రిష సంచలన కామెంట్స్ వైరల్..!! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!














Click it and Unblock the Notifications