వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యజమాని విదేశాలకు, ఏటీఎంతో ఫాతిమా ఎస్కేప్, సెల్వంతో కలిసి తమిళనాడులో జల్సాలు !

కుటుంబ సభ్యుల కోసం యజమాని విదేశాలకు. చెయ్యివాటం చూపించిన పని మనిషి ఫాతిమా. సెల్వంతో కలిసి తమిళనాడు చెక్కేసి జల్సాలు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇంటి యజమాని విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులను చూడటానికి వెళ్లిన సమయంలో ఆమె ఏటీఎం కార్డు చోరీ చేసిన పనిమనిషి భర్తతో కలిసి తమిళనాడు పారిపోయి నగదు డ్రా చేసుకుని జల్సాలు చేసింది. చివరికి కర్ణాటక పోలీసులకు పట్టుబడి కటకటాలపాలైయ్యింది.

హిందూ, ముస్లీం దంపతులు, బెంగళూరులో ఇంటర్వూ: హోటల్ లో రూం ఇవ్వం, చివరికి !హిందూ, ముస్లీం దంపతులు, బెంగళూరులో ఇంటర్వూ: హోటల్ లో రూం ఇవ్వం, చివరికి !

మంగళూరులోని హళ్నీర్ ప్రాంతంలో బిట్రో లేన్ నే జాయ్స్ (70) అనే వృద్దురాలు నివాసం ఉంటోంది. ఈమె ఇంటిలో ఫాతిమా (27) అనే మహిళ పని మనిషిగా పని చేస్తోంది. రెండు నెలల క్రితం వృద్దురాలు జాయ్స్ విదేశాలకు వెళ్లారు. ఇంటిలో ఫాతిమా మాత్రమే ఉంది.

The Mangaluru Pandeshwara South Police arrested a couple from Tamil Nadu.

తరువాత వృద్దురాలు జాయ్ కు చెందిన ఏటీఎం కార్డును ఫాతిమా చోరీ చేసింది. డైరీలో రాసిపెట్టిన ఏటీఎం పిన్ కోడ్ నోట్ చేసుకుంది. తనకు ఇంటిలో పని చెయ్యడం ఇష్టం లేదని విదేశాల్లో ఉన్న యజమాని జాయ్స్ కు సమాచారం ఇచ్చిన ఫాతిమా భర్త సెల్వంతో కలిసి తమిళనాడు పారిపోయింది.

వివాహిత మహిళతో జల్సాలు: దినపత్రిక రిపోర్టర్ దారుణ హత్య, గెస్ట్ హౌస్ లో అడ్డంగా !వివాహిత మహిళతో జల్సాలు: దినపత్రిక రిపోర్టర్ దారుణ హత్య, గెస్ట్ హౌస్ లో అడ్డంగా !

తమిళనాడులో వృద్దురాలు జాయ్స్ చెందిన ఏటీఎం కార్డు ఉపయోగించి రూ. 3, 59, 000 డ్రా చేసుకున్నారు. డ్రా చేసిన నగదుతో ఫాతిమా ఓ బంగారు చైన్ కొనుగోలు చేసింది. విదేశాల నుంచి మంగళూరు చేరుకున్న వృద్దురాలు జాయ్ తన ఏటీఎం కార్డు చోరీ అయ్యిందని, రూ. 3. 59 లక్షలు డ్రా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

The Mangaluru Pandeshwara South Police arrested a couple from Tamil Nadu.

జాయ్స్ ఇంటి మాజీ పని మనిషి ఫాతిమా మీద అనుమానం రావడంతో పోలీసులు తమిళనాడులో గాలించారు. ఫాతిమా, ఆమె భర్త సెల్వంను తమిళనాడులో అరెస్టు చేసి బంగారు చైన్, రూ. 2.20 లక్షలు స్వాధీనం చేసుకుని ఇద్దరినీ జైలుకు పంపించామని మంగళూరు పోలీసులు తెలిపారు.

English summary
The Mangaluru Pandeshwara South Police arrested a couple from Tamil Nadu for withdrawing money in lakhs from a stolen ATM card on July 4.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X