Year Ender 2025: ఈ ఏడాది పర్యాటకులు ఎక్కువగా తిరిగిన ప్రాంతాలివే..!
ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక స్థలాలున్న భారత్ లో ఈ ఏడాది కూడా దేశ, విదేశీ పర్యాటకులు (tourist) వీటిని సందర్శించారు. ఇందులో పలు చారిత్రక కట్టడాలతో పాటు స్థలాలు, బీచ్ లు, నదీ తీరాలు ఇలా చాలానే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఈసారి పర్యాటకుల సందడి పెరిగింది. ఇందులో ఈ ఏడాది కుంభమేళా జరిగిన ప్రయాగ్ రాజ్ కూడా ఉంది. దీంతో ఆయా ప్రాంతాలు పర్యాటక ఆదాయం కూడా భారీగానే అర్జించాయి.
ఈ ఏడాది భారత్ లో అత్యధిక పర్యాటకులు సందర్శించిన కొన్ని టాప్ పర్యాటక ప్రాంతాల్లో మహా కుంభమేళా జరిగిన ప్రయాగ్ రాజ్, కాశ్మీర్, పాండిచ్చేరి, గోవా, లడఖ్, వారణాసి, ఉదయపూర్ ఇలా చాలానే ఉన్నాయి. వీటిలో అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివెళ్లిన మహా కుంభమేళా టాప్ లో నిలిచింది. ఈ ఏడాది జరిగిన కుంభమేళాకు దాదాపు 100 కోట్లకు పైగా భక్తులు వెళ్లి ఉంటారని ఓ అంచనా. ఈ సందర్భంగా పలుమార్లు తొక్కిసలాటలు కూడా చోటు చేసుకున్నాయి.

ప్రయాగ్ రాజ్ తర్వాతి స్ధానంలో ఎప్పటిలాగే కాశ్మీర్ కూడా టాప్ పర్యాటక స్థలంగా నిలిచింది. సహజసిద్ధమైన కాశ్మీర్ అందాల్ని చూసేందుకు ఈ ఏడాది కూడా భారీ ఎత్తున పర్యాటకులు వచ్చారు. మధ్యలో ఏప్రిల్ లో పహల్గాం ఉగ్రదాడి జరిగినా కాశ్మీర్ కు వచ్చే పర్యాటకులకు అది ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దాల్ లేక్ అందాలు, అల్పైన్ గడ్డి మైదానాలు, గుల్మార్గ్ వింటర్ స్పోర్ట్స్ పర్యాటకుల్ని అలరించాయి. అలాగే పాండిచ్చేరిలో ఫ్రెంచ్ భవనాలు, అక్కడి కోస్తా తీరం మౌనం పర్యాటకుల్ని ఆకట్టుకున్నాయి.

ఆ తర్వాత గోవా బీచ్ లు కూడా ఎప్పటిలాగే పర్యాటకులకు ఆతిధ్యం పలికాయి. ఇక్కడి బీచ్ లతో పాటు ఇండో-పోర్చుగీస్ సాంస్కృతిక వారసత్వం కూడా పర్యాటకుల్ని అలరించింది. అలాగే కాశ్మీర్ లోని లడఖ్ లో ఎత్తైన ప్రాంతాల్ని పర్యాటకులు ఎక్కువగా సందర్శించారు. దీంతో పాటు వారణాసిలో ఆధ్యాత్మిక ప్రాంతాలకు కూడా పర్యాటకులు పోటెత్తారు. అలాగే రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ సరస్సులకు కూడా పర్యాటకుల సందడి కొనసాగింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications