వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో బీజేపీ దిద్దుబాబు.. దళితుడి ఇంట సీఎం యోగి భోజనం

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలో సామాజిక న్యాయం లేదంటూ పార్టీకి రాజీనామా చేసి.. ఆరోపణలు గుప్పించిన మాజీ మంత్రులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా తిప్పికొట్టారు. తమ పాలనలో అన్ని వర్గాలకు సమ న్యాయం జరిగందన్నారు. గోరఖ్ పూర్‌లోని ఓ దళితుడి ఇంట్లో యోగి భోజనం చేశారు. వంశపారంపర్య రాజకీయాలు చేసే వారు సమాజంలో ఏవర్గానికి న్యాయం చేయలేరంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేఖ్ యాదవ్ పైవిరుచుకుపడ్డారు. అఖిలేశ్ యాదవ్ పాలనలోనే సామాజిక దోపిడి జరిగిందని మండిపడ్డారు.

బీజేపీ దిద్దుబాటు.. ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు యోగి వ్యూహం

యూపీలోని బీజేపీ నుంచి వరుసగా మంత్రులు, ఎమ్మెల్యే రాజీనామా బాటపట్టడంతో ఆపార్టీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. సీఎం యోగి ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. గోరఖ్ పూర్‌లో ఓ దళితుడు నివాసంలో భోజ‌నం చేశారు. అమృత్ లాల్ భారతీ ఇచ్చిన అథిత్యాన్ని సీఎం స్వీకరించారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన జుంగియాకు చెందిన అమృతలాల్ భారతి నివాసంలో సంక్రాతి పండుగ సందర్భంగా ఖిచ్డీ, ప్రసాదాన్ని స్వీకరించే అదృష్టం తనకు కలిగిందన్నారు. దళితుడు అమృత్ లాల్ భారతితో కలిసి భోజనం చేసిన వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు సీఎం యోగి .

 అఖిల్ పాల‌న‌లోనే సామిజిక దోపిడీ

అఖిల్ పాల‌న‌లోనే సామిజిక దోపిడీ


ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ పాలనలో అన్నివర్గాలకు సమన్యాయం జరిగిందని సీఎం యోగి పేర్కొన్నారు. 2012 నుంచి 2017 వరకు అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని పాలనలో సామాజిక దోపిడీ జరిగిందని విమర్శించారు. 2012 నుంచి 1017 వరకు సమాజ్ వాదీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద కేవలం 18,000 ఇళ్ళను మాత్రమే నిర్మింగలిగిందని విమర్శించారు. తమ ఐదేళ్ల పాలనలో 45 లక్షల ఇళ్లు, కట్టించి పేదలు, అణగారిన వర్గాలకు ఇచ్చామని చెప్పారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ నిధుల‌తో 2.61 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు మంజూరు చేశామని తెలిపారు. ఉజ్వల యోజన క్రింద 1.36 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందాయని యోగి చెప్పారు.

 ఎస్పీలో చేరిన ముగ్గురు మంత్రులు.. ఎమ్మెల్యేలు

ఎస్పీలో చేరిన ముగ్గురు మంత్రులు.. ఎమ్మెల్యేలు


వంశపారంపర్య రాజకీయలు చేసేవారు సమాజంలో ఏవర్గానికి న్యాయం చేయలేరని అఖిలేష్ యాదవ్ పై మండిపడ్డారు. సమాజ్ వాదీ పార్టీ పాలన‌లో దళితులు, పేదల హక్కులను కాలరాశారని ఆరోపించారు. కాగా, బీజేపీ పాలనలో వెనుకబడిన వర్గాలకు, మైనార్టీలకు, దళితులకు గుర్తింపు లేదని చిన్న చూపు చూస్తున్నారంటూ ఆపార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు ఆరోపించారు. కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. వారంతా అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో స‌మాజ్ వాదీ పార్టీలో చేరారు. యోగి ప్రభుత్వంలో అవమానాలకు గురైయ్యామని ప్ర‌సాద్ మౌర్య ఆరోపించారు..

English summary
UP CM Yogi Adityanath had lunch at the residence of a dalit Amruitlal Bharti in Gorakhpur
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X