వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : భారత్‌లో బస్సు కాంట్రాక్టులకు లంచాలు... మంత్రికి కూడా... స్కానియా కంపెనీ సంచలనం...

|
Google Oneindia TeluguNews

స్పీడన్‌కి చెందిన బస్సుల తయారీ సంస్థ,వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటైన స్కానియా భారత్‌లోని తమ కార్యకలాపాల్లో తీవ్ర అవినీతి,అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించింది. భారత్‌లోని దాదాపు ఏడు రాష్ట్రాల్లో 2013-2016 మధ్యలో బస్సు కాంట్రాక్టుల కోసం తమ ఉద్యోగులు అధికారులకు ముడుపులు చెల్లించినట్లు గుర్తించింది. అంతేకాదు,స్కానియా కంపెనీ ప్రతినిధుల నుంచి ఓ మంత్రికి కూడా ముడుపులు అందినట్లు విచారణలో తేలింది. స్వీడిష్ ఛానెల్ ఎస్వీటీతో పాటు జర్మన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ జెడ్‌డీఎఫ్ ఈ విషయాలను బయటపెట్టాయి.

2017 నుంచి అంతర్గత విచారణ...

2017 నుంచి అంతర్గత విచారణ...


భారత్‌లో స్కానియా కార్యకలాపాల్లో చోటు చేసుకున్న అవినీతి,అక్రమాలపై ఆ సంస్థ 2017 నుంచి అంతర్గత విచారణ చేపట్టినట్లు ఆ మీడియా సంస్థలు వెల్లడించాయి. భారత్‌లోని ఆయా రాష్ట్రాల్లో కనీసం 19 కేసుల్లో బస్సు కాంట్రాక్టుల కోసం తమ ఉద్యోగులు,మేనేజర్లు స్థానిక ప్రభుత్వ అధికారులకు ముడుపులు చెల్లించినట్లు ఆ సంస్థ గుర్తించింది. మొత్తం 77,300 డాలర్ల వరకు ముడుపులు చెల్లించినట్లుగా గుర్తించింది.అంతేకాదు,దాదాపు 100 ట్రక్కులకు తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడిచే మైనింగ్ కంపెనీలకు వాటిని విక్రయించినట్లుగా తేల్చింది.

అప్పటినుంచి కార్యకలాపాల నిలిపివేత...

అప్పటినుంచి కార్యకలాపాల నిలిపివేత...

స్కానియా సీఈవో హెన్రిక్‌సన్ దీనిపై మాట్లాడుతూ... 2013-2017 మధ్య కాలంలో తమ సంస్థ కార్యకలాపాల్లో అవతవకలను గుర్తించినట్లు తెలిపారు.భారత్‌లోని తమ ఉద్యోగులు,సీనియర్ మేనేజ్‌మెంట్‌,బిజినెస్ పార్ట్‌నర్స్‌‌కు ముడుపుల వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు. అప్పటినుంచి భారత్‌లో బస్సుల అమ్మకాలను నిలిపివేశామని.. అక్కడి తమ ఫ్యాక్టరీని కూడా మూసివేశామని చెప్పారు. ముడుపుల వ్యవహారంలో ప్రమేయం ఉన్న సీనియర్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే సంస్థ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. అలాగే ఈ వ్వవహారంతో సంబంధం వున్న బిజినెస్ పార్ట్‌నర్స్ కాంట్రాక్టులన్నీ రద్దయినట్లు తెలిపారు.

ముడుపుల వ్యవహారంలో మంత్రి కూడా...

ముడుపుల వ్యవహారంలో మంత్రి కూడా...

బస్సు కాంట్రాక్టుల కోసం భారత్‌లోని ఓ మంత్రికి కూడా ముడుపులు చెల్లించినట్లు స్కానియా అంతర్గత విచారణలో వెల్లడవడం గమనార్హం. స్కానియాలో అవినీతి,అక్రమాలకు పాల్పడినవారి నేరం రుజువు చేసేందుకు తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయన్నారు. అయితే న్యాయపరంగా ముందుకెళ్లడానికి మరింత బలమైన సాక్ష్యాధారాలు అవసరమని... ఇవి మాత్రమే సరిపోవని హెన్రిక్‌సన్ పేర్కొన్నారు. కాగా,వోక్స్‌వ్యాగన్ వాణిజ్య-వాహన యూనిట్లలో స్కానియా కంపెనీ కూడా ఒక భాగస్వామిగా ఉంది. భారత్‌లో కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థ అవినీతి,అక్రమాల కారణంగా భారత మార్కెట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

English summary
Volkswagen AG’s Swedish truck brand Scania has investigated and discovered evidence that employees in India were involved in bribing local officials for bus contracts.The bribes were also given to an unnamed Indian minister, according to the report by SVT,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X