హెచ్1బీ షాకుల ఎఫెక్ట్..! ఆ వీసాకు అనూహ్యంగా భారీ డిమాండ్..!
అమెరికాలో గతేడాది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయుల్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో హెచ్1బీ వీసాల కోత ప్రధానమైనది. అంతకు ముందు వలసల బహిష్కరణ, తాజాగా సుంకాల మోత నిర్ణయాలు తీసుకున్నా వాటికి ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్న భారతీయులు.. హెచ్1బీ వీసాల విషయంలోనూ ప్రత్యామ్నాయాన్ని త్వరగానే వెతుక్కుంటున్నారు. దీంతో ఇప్పుడు ఆ ప్రత్యామ్నాయ వీసాకు అమెరికాలో భారీ డిమాండ్ ఏర్పడింది.
హెచ్1బీలకు ప్రత్యామ్నాయ వీసా
అమెరికాలో హెచ్1బీ వీసాల జారీ నిబంధనలు కఠినం చేయడంతో పాటు వాటి వార్షిక ఫీజును సైతం లక్ష డాలర్లకు పెంచేయడం వంటి చర్యలతో భారతీయులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదో విధంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు అడ్డదారులు వెతికే పనిలో పడ్డారు. అవి కూడా అంతగా ఫలించకపోవడంతో చివరిగా అమెరికా జారీ చేసే మరో వీసా ఒకదాన్ని తమకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. అదే ఐన్ స్టీన్ వీసా లేక ఈబీ1 వీసా.

ఐన్ స్టీన్ వీసా
విదేశీ నిఫుణులకు హెచ్1బీ వీసాల జారీ అమెరికన్ కంపెనీలకు సైతం కష్టతరంగా మారడంతో భారతీయులు వాటికి ప్రత్యామ్నాయంగా ఉన్న వీసాల్ని వెతకడం ప్రారంభించారు. ఇందులో భాగంగా తెరపైకి వచ్చిందే ఐన్ స్టీన్ వీసా. దీంతో ఇప్పుడు ఈ వీసా ద్వారా అమెరికాలోకి ప్రవేశించేందుకు భారతీయులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వీసాలు ఇప్పించేందుకు అమెరికాలోనే భారీ సంఖ్యలో ఫేక్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు వీటిపైనా ఫోకస్ పెడుతున్నారు.

ఐన్ స్టీన్ వీసా ఎవరికి ఇస్తారు ?
ఐన్ స్టీన్ వీసాకు అసలు పేరు ఈబీ-1 వీసా. అసాధారణ సామర్ధ్యం కలిగిన వారు లేదా అధిక సంఖ్యలో విజయాలు సాధించిన వారు, వివిధ రంగాల్లో అగ్రస్థానాల్లో ఉన్న వారికి అమెరికా ప్రభుత్వం ఈ వీసా జారీ చేస్తుంది. ఇందులో ఈబీ1ఏ, ఈబీ1బీ, ఈవీ1సీ వంటి కేటగిరీలు ఉంటాయి. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ తరహాలో అసాధారణ ప్రతిభావంతులకు దీన్ని జారీ చేస్తున్నందున ఈ పేరు పెట్టారు. అమెరికాలో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, బహుమతులు పొందిన వారు, అసాధారణ విజయాలు సాధించిన వారికి సభ్యత్వాలు ఇచ్చే అసోసియేషన్లలో ఉన్న వారు, మీడియాలో భారీ కవరేజ్ పొందుతున్న వారు, న్యాయనిర్ణేతలు, అత్యుత్తమ రచయితలకు వీటిని ఇస్తారు. ఇప్పుడు ఈ కేటగిరీలో వీసాల కోసం భారతీయులు క్యూ కడుతున్నారు.
-
ఇరాన్ యుద్ధంలో ఓడిపోతోంది ఎవరు ? తెరవెనుక ఏం జరుగుతోంది ? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications