వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Russia VS Ukraine: రష్యా, ఉక్రెయిన్ కు తాలిబన్ల ఉచిత సలహ, అబ్బా ఏం చెప్పితివి ఏం చెప్పితివి !

|
Google Oneindia TeluguNews

మాస్కో/ఉక్రెయిన్/ కాబూల్: ఉక్రెయిన్ మీద యుద్దం ప్రకటించిన రష్యా ఆ దేశం మీద పగ, ప్రతీకారంతో రగిలిపోయింది. ఉక్రెయిన్ లో మెరుపుదాడులకు దిగిన రష్యా ఆదేశం మీద పెత్తనం చెలాయించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు నగరాలు, మిలటరీ స్థావరాలు మీద రష్యా సైనిక బలగాలు బాంబుల మోతమోగించాయి. ఉక్రెయిన్ కూడా రష్యా బలగాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకోవాలని రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. కీవ్ నగరాన్ని కాపాడుకోవడానికి ఉక్రెయిన్ సైనిక బలగాలు కూడా ఎదురుదాడికి దిగాయి. కీవ్ లోని విక్టరీ అవెన్యూ ఆర్మీ బేస్ ను స్వాధీనం చేసుకోవాలని రష్యా బలగాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఉక్రెయిన్ ఆర్మీ బలగాలు ఎదురుదాడికి దిగి కీవ్ లోని విక్టరీ అవెన్యూ ఆర్మీ బేస్ ను కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. రష్యా బలగాలను తాము తిప్పికొడుతున్నామని, మాదేశాన్ని మేము కాపాడుకుంటామని ఉక్రెయిన్ సైనిక అధికారులు సోషల్ మీడియా వేదికగా ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తాలిబన్లు స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ దేశాలు సంయమనం పాటించాలని తాలిబన్లు మనవి చేశారు. హింసాత్మక ఘటనలు ప్రేరేపించే చర్యలకు ఇరు దేశాలు వెనక్కి తగ్గాలని, యుద్దంతో సమస్య పరిష్కారం కాదని, రెండు దేశాల ప్రతినిధులు కుర్చుని శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని తాలిబన్లు ఉచిత సలహా ఇచ్చేశారు. గత ఏడాది అఫ్గనిస్తాన్ ప్రభుత్వంపై విరుచుకుపడిని తాలిబన్లు అఫ్గనిస్తాన్ సైనికులు, సామాన్య ప్రజల రక్తం తాగి ఆదేశాన్ని స్వాధీనం చేసుకుని ఇప్పుడు పెత్తనం చెలాయిస్తున్నారు. కసాయి వాడు గొర్రెకు నీతులు చెప్పినట్లు ఇప్పుడు తాలిబన్లు శాంతిని కాపాడాలని రష్యా, ఉక్రెయిన్ కు ఉచిత సలహా ఇవ్వడంతో అందరూ నవ్వుకుంటున్నారు.

Lady: ఆంటీ అంటూనే కామంతో ?, ఎదురు తిరిగిందని చంపేసి సోఫాలో శవం సెట్ చేశాడు, భర్త వెనుకనే !Lady: ఆంటీ అంటూనే కామంతో ?, ఎదురు తిరిగిందని చంపేసి సోఫాలో శవం సెట్ చేశాడు, భర్త వెనుకనే !

 రెచ్చిపోయిన రష్యా

రెచ్చిపోయిన రష్యా

ఉక్రెయిన్ మీద యుద్దం ప్రకటించిన రష్యా ఆ దేశం మీద పగ, ప్రతీకారంతో రగిలిపోయింది. ఉక్రెయిన్ లో మెరుపుదాడులకు దిగిన రష్యా ఆదేశం మీద పెత్తనం చెలాయించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు నగరాలు, మిలటరీ స్థావరాలు మీద రష్యా సైనిక బలగాలు బాంబుల మోతమోగించాయి.

 ఉక్రెయిన్ కూడా తక్కువ ఏమీ కాదు

ఉక్రెయిన్ కూడా తక్కువ ఏమీ కాదు

ఉక్రెయిన్ కూడా రష్యా బలగాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకోవాలని రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. కీవ్ నగరాన్ని కాపాడుకోవడానికి ఉక్రెయిన్ సైనిక బలగాలు కూడా ఎదురుదాడికి దిగాయి.

 పిచుక మీద బ్రహ్మాస్త్రం

పిచుక మీద బ్రహ్మాస్త్రం

కీవ్ లోని విక్టరీ అవెన్యూ ఆర్మీ బేస్ ను స్వాధీనం చేసుకోవాలని రష్యా బలగాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉక్రెయిన్ ఆర్మీ బలగాలు ఎదురుదాడికి దిగి కీవ్ లోని విక్టరీ అవెన్యూ ఆర్మీ బేస్ ను కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. రష్యా బలగాలను తాము తిప్పికొడుతున్నామని, మాదేశాన్ని మేము కాపాడుకుంటామని ఉక్రెయిన్ సైనిక అధికారులు సోషల్ మీడియా వేదికగా ధీమా వ్యక్తం చేశారు.

 అబ్బా..... ఏం చెప్పిత్తివి ఏం చెప్పితివి

అబ్బా..... ఏం చెప్పిత్తివి ఏం చెప్పితివి

ఉక్రెయిన్ మీద రష్యా యుద్దం చేస్తున్న సమయంలో తాలిబన్లు స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ దేశాలు సంయమనం పాటించాలని తాలిబన్లు మనవి చేశారు. హింసాత్మక ఘటనలు ప్రేరేపించే చర్యలకు ఇరు దేశాలు వెనక్కి తగ్గాలని, యుద్దంతో సమస్య పరిష్కారం కాదని, రెండు దేశాల ప్రతినిధులు కుర్చుని శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని తాలిబన్లు సోషల్ మీడియాలో ఓ ట్విట్ చేసి ఇరు దెశాలకు ఉచిత సలహా ఇచ్చేశారు.

 కసాయి వాడు గొర్రెకు నీతులు చెప్పినట్లు ఉంది

కసాయి వాడు గొర్రెకు నీతులు చెప్పినట్లు ఉంది

గత ఏడాది అఫ్గనిస్తాన్ ప్రభుత్వంపై విరుచుకుపడిని తాలిబన్లు అఫ్గనిస్తాన్ సైనికులు, సామాన్య ప్రజల రక్తం తాగి ఆదేశాన్ని అదే ఏడాది ఆగస్టు నెలలో స్వాధీనం చేసుకుని ఇప్పుడు పెత్తనం చెలాయిస్తున్నారు. కసాయి వాడు గొర్రెకు నీతులు చెప్పినట్లు ఇప్పుడు తాలిబన్లు శాంతిని కాపాడాలని రష్యా, ఉక్రెయిన్ కు ఉచిత సలహా ఇవ్వడంతో అందరూ నవ్వుకుంటున్నారు.

English summary
Russia VS Ukraine: Taliban urge Russia and Ukraine to show restraint resolve crisis through peaceful dialogue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X