వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ కు ఓటేస్తానన్న భర్త.. కోపంతో 77 ఏళ్ల భర్తకు విడాకులిచ్చిన భార్య

వారిద్దరూ దాదాపు 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారు. కానీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భర్త డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు ఇవ్వడం ఆమెకు ఎంతమాత్రం నచ్చలేదు. అంతే.. విడాకులు ఇచ్చిపారేసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజిల్స్: ఆమెకు 73 ఏళ్లు, భర్తకు 77 ఏళ్లు. వారిద్దరూ దాదాపు 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారు. కానీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భర్త డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు ఇవ్వడం ఆమెకు ఎంతమాత్రం నచ్చలేదు. అంతే.. విడాకులు ఇచ్చిపారేసింది.

ఈ పని చేసింది అమెరికాలోని కాలిఫోర్నియాలో జైలు గార్డుగా పనిచేసి రిటైరయిన గేల్ మెక్ కార్మిక్. తన భర్త బిల్ మెక్ కార్మిక్ స్నేహితులతో కలిసి లంచ్ చేస్తున్న సందర్భంలో తాను ట్రంప్ కు ఓటేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారని, దాంతో తన గుండె బద్ధలైందని, ఇక అలాంటి మనిషితో కాపురం చేయడం కష్టమని భావించి విడాకులిచ్చానని గేల్ మెక్ కార్మిక్ పేర్కొంది.

ప్రస్తుతం వాషింగ్టన్ లోని తన సొంత అపార్ట్ మెంట్ లో ఆమె ఒంటరిగా నివసిస్తోంది. ఇదేదో హడావుడిగా తీసుకున్న నిర్ణయం కాదని, ఈ నిర్ణయం తీసుకోవడానికి తనకు చాలా నెలలు పట్టిందని, కౌన్సెలింగ్ కు వెళ్లి, ఒక మతగురువును కూడా సంప్రదించి.. ఇంకా చాలా చాలా చేసిన తరువాతే తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

Till Donald Trump do us apart: Woman divorces her husband of 20 years over his support for president

గేల్, బిల్.. ఇద్దరూ 1980లో మొదటిసారి కలనుసుకున్నారు. ఇద్ధరూ ఒకే జైలులో పనిచేసేవారు. అన్ని విషయాలలో అభిప్రాయాలు 51 శాతం కలిసి, 49 శాతం కలవకపోయినా ఇద్దరూ కలిసే ఉండొచ్చని గేల్ అభిప్రాయపడింది.

ఎప్పుడన్నా తమ ఇద్దరి మధ్య రాజకీయాల విషయం వస్తే కూడా మౌనంగా అక్కడినుంచి లేచి వెళ్లిపోయాదానినని, కానీ ట్రంప్ విషయంలో మాత్రం మాట్లడకుండా ఉండలేకపోయానని, తమ మధ్యన చాలా తేడాలున్నాయని, తాను ఇప్పటికే బాగా అలసిపోయానని గేల్ చెప్పింది. విడాకులు ఇచ్చినా ఇప్పటికీ తాను తన భర్తని ప్రేమిస్తున్నానని, అతడు సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నానని ఆమె పేర్కొంది.

English summary
Los Angeles: A 73-year-old woman has separated from her husband of over 20 years after he voiced support for Donald Trump in the run-up to the US presidential polls. Gayle McCormick, a retired California prison guard, said she was shocked last year when her husband Bill McCormick, 77, mentioned during a lunch with friends that he planned to vote for Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X