కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాల్క సుమన్‌కు సీఎం కేసీఆర్ పరామర్శ..

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. సుమన్ తండ్రి బాల్క సురేశ్ సంస్మరణ సభకు ఇవాళ హాజరయ్యారు. రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి మెట్ పల్లి చేరుకున్నారు. సురేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యేలు ఉన్నారు.

తర్వాత కలెక్టర్ రవితో కేసీఆర్ మాట్లాడారు. కరోనా పరిస్థితుల గురించి ఆరాతీశారు. లాక్ డౌన్ వల్ల జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టాయని కలెక్టర్ వివరించారు. లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సుమన్ తండ్రి బాల్క సురేష్ ఇటీవల చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మెట్‌పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో అనారోగ్యంతో గతనెల 28వ తేదీన చనిపోయారు.

cm kcr consoles to balka suman

మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన సురేశ్, టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల నాయకుడిగా చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో బాల్క సుమన్ చురుకైన పాత్ర పోషించారు. తండ్రి వెన్నుదన్నుగా ప్రోత్సహించడంతోనే.. సుమన్ విద్యార్థి జేఏసీ నేతగా, రాజకీయాల్లో రాణించగలుగుతున్నారు. ఈ నెల 10వ తేదీన సురేశ్ కర్మ జరగనుంది.

బాల్క సుమన్ చొచ్చుకొని వెళతారు. ఆ క్రమంలోనే కేటీఆర్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఓ న్యూస్ యాంకర్‌ను సుమన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత చెన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రభుత్వ విప్‌గా పనిచేస్తున్నారు. సుమన్ ఎదుగుతున్న క్రమంలో.. తండ్రి సురేశ్ మరణం వారి కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. బాల్క సుమన్ మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులు.. ఇటీవల కేటీఆర్ కూడా సుమన్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే.

English summary
telangana cm kcr consoles to mla balka suman at regunta. suman father suresh recently died due to illness
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X