TPCC వర్కింగ్ ప్రెసిడెంట్లు, నామినేటెడ్ పోస్టులపై కీలక నిర్ణయం..!!
కాంగ్రెస్ పార్టీలో కీలక పోస్టుల భర్తీ పై కసరత్తు జరుగుతోంది. నియామకాల ప్రకటనకు ముహూర్తం ఖరారు అవుతోంది. సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ అధినాయకత్వంతో వరుసగా సమావేశాల దిశగా సిద్దమయ్యారు. పంచాయితీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో స్థానిక ఎన్నికలు, రానున్న గ్రేటర్ ఎన్నికల కోసం పార్టీ సమాయత్తం అవుతోంది. అందులో భాగంగా ఈ నియామకాల భర్తీ దిశగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ లో పెండింగ్ పోస్టుల భర్తీ పైన టీపీసీసీ చీఫ్ కీలక అంశాలను వెల్లడించారు.
త్వరలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్‌లు భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. టీపీసీసీ నియామకం జరిగిన రోజే డీసీసీలతో మినహా అన్ని పోస్టులు రద్దు అవుతా యని తెలిపారు. ఈనెల చివరి నాటికి కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. లంబాడాలకు నాలుగు జిల్లాలకు అధ్యక్షులను నియమించామని తెలిపారు. ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ చూడలేక మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఊహించని స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని చెప్పుకొచ్చారు. పేరుగాంచిన కంపెనీలతోనే ఒప్పందాలు జరిగాయని వివరించారు. ముందు కొన్ని కార్యక్రమాలు ఫిక్స్ కావడంతో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే ,రాహుల్ గాంధీ గ్లోబల్ సమ్మిట్‌కు రాలేకపోయారని తెలిపారు.

ఫ్యూచర్ సిటీ భవిష్యత్‌లో గొప్పగా ఉంటుందని మహేష్ గౌడ్ చెప్పారు. లావాదేవీలలో భాగంగానే కవిత - బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు చేసుకుంటున్నారని వివరించారు. కవిత కారణంగా బీఆర్ఎస్ కబ్జాలు అన్ని బయటకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. కవిత ఆరోపణలపై విచారణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తన్నట్లు తెలిపారు. తాను పీసీసీగా చాలా సంతృప్తిగా ఉన్నానని స్పష్టం చేసారు. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ కోసం వందేమాతరాన్ని బీజేపీ తెరపైకి తెచ్చిందని విమర్శించారు. మోదీ జీవితంలో అతిపెద్ద పొరపాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ముఖ్యమంత్రి ఉస్మానియా విశ్వవిద్యాలయం వెళ్లాలంటే భయపడ్డరాని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. 60 సంవత్సరాల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఎక్కడం చరిత్ర అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications