'అఖండ 2' కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న 'అఖండ-2' సినిమాకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఈ చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రీమియర్ షో టికెట్ల పెంపు జీవోను సస్పెండ్ చేసింది. ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో పాటు నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. మరోవైపు ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రీమియర్స్ మొదలుకానున్నాయి. ఇప్పటికే అభిమానులు రూ. 600 పెట్టి టికెట్లు కొనుగోలు చేశారు. ఇక పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 12 న విడుదలకు సిద్ధం అయింది.
నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో మూవీ 'అఖండ 2'.. తాజాగా ఈ మూవీ నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రీమియర్ షో టికెట్ల పెంపు జీవోను సస్పెండ్ చేసింది. ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో పాటు నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇక ఈ మూవీని ఈ నెల 12 న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. 11 న ప్రీమియర్స్ ఉంటాయని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. అయితే ఈ మూవీ ఈ నెల 5 నే విడుదల కావాల్సింది. కానీ ఫైనాన్షియల్ వివాదాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదాలకు సంబంధించిన అడ్డంకులన్నీ తొలిగిపోయిన నేపథ్యంలో మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.

ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషించారు. ఆయన సరసన మూవీలో సంయుక్త మీనన్ నటించారు. విలన్ గా ఆది పినిశెట్టి నటించారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. నందమూరి తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించింది. ఈ మూవీ తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం అయింది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications