హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

AskKTR: బాబుబలి చూస్తానని కేటీఆర్, 'బాస్' అరెస్ట్‌పై ప్రశ్న, ఏపీ ప్రజలపై..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రయోగం చేశారు. ట్విట్టర్ లైవ్‌లో అందుబాటులో వచ్చారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల నుంచి 'ఆస్క్ కేటీఆర్' పేరిట నెటిజన్లకు కేటీఆర్ అందుబాటులో ఉంటున్నారు.

హైదరాబాద్‌పై సూచనలు, సలహాలను నెటిజన్ల నుంచి కేటీ రామారావు స్వీకరిస్తారు. నెటిజన్ల సందేహాలకు కేటీఆర్ సమాధానం ఇస్తారు. @weAreHyderabad అకౌంట్ నుంచి మంత్రి సమాధానాలు ఇస్తారు.

హైదరాబాదులోని సమస్యల పైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజల సందేహాలకు సమాధానాలు కూడా ఇస్తానని కేటీ రామారావు తన ట్విట్టర్ అకౌంటులో అంతకుముందు ట్వీట్ చేశారు. కాగా, కేటీఆర్‌ను ట్విట్టర్‌లో పలువురు పలకరించారు.

వరంగల్ అభివృద్ధి గురించి ఒకరు అడగగా, త్వరలో బీపీవో వస్తుందని, మరిన్ని క్యూ కడతాయని చెప్పారు.

మరొకరు మిమ్మల్ని కలవాలనేది నా కోరిక అని, మీతో ఫోటో తీసుకోవాలని ఉందని, మీరు కామన్ మ్యాన్‌‍కు అందుబాటులో ఉంటారా అని ప్రశ్నించారు. దానికి కేటీఆర్ తన పీఆర్వో నెంబర్ ఇచ్చి, సోమవారం రావాలని సూచించారు.

రానున్న రోజుల్లో మీరు కేంద్ర ప్రభుత్వంతో కలుస్తారా అని ప్రశ్నించడం గమనార్హం. 'బాస్' అరెస్టు గురించి ఒకరు అడగగా... మన దేశంలో చట్టం ఉందని, అది తన పని చేసుకుపోతుందన్నారు.

మీరు బాహుబలి చూస్తారా అని ఒకరు అడగగా.. మూవీస్ అంటే తనకు ఇష్టమని, తప్పకుండా చూస్తానని చెప్పారు. రాజమౌళి వండర్ ఫుల్ డైరెక్టర్ అన్నారు.

ఏపీ ప్రజలంటే మీకు పడదా అని మరొకరు అడిగితే, శుద్ధ తప్పు అని చెప్పారు.

ఏబీఎన్ బ్యాన్ గురించి ఒకరు అడిగితే.. యూ మీన్ సీబీఎన్ అని ఎదురు ప్రశ్నించారు.

పలువురు అడిగిన వాటికి ఆయన సమాధానాలు చెప్పారు.

సెల్‌కాన్ కంపెనీని ప్రారంభించిన కేటీఆర్

రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లోని పారిశ్రామికవాడలో సెల్‌కాన్ మొబైల్ తయారీ కంపెనీని కేటీ రామారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సెల్‌కాన్ కంపెనీని రాష్ట్రంలో ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు.

ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఇప్పడు సెల్‌కాన్ వచ్చిందని, రేపు మైక్రోమాక్స్ కంపెనీ రాబోతుందని చెప్పారు. సెల్‌కాన్ కంపెనీని మరింత విస్తరించాలని కోరుకుంటున్నానన్నారు. భారతదేశంలో 100 కోట్ల మొబైల్స్ తయారు చేస్తున్నారని, కంపెనీలు మాత్రం తక్కువ ఉన్నాయన్నారు.

మేకిన్ ఇండియాలో భాగంగా మేకిన్ తెలంగాణ కావాలని రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని అవలంభిస్తోందని, పరిశ్రమల ద్వారా రాష్ట్రంలో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. పారిశ్రామిక రంగంలో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు.

English summary
askktr: KTR twitter live from today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X