ఎమ్మెల్యే సంపత్ కుమార్‌కు చేదు అనుభవం, మంత్రితో వాగ్వాదం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌కు బుధవారం చేదు అనుభవం ఎదురైంది.

గద్వాల కలెక్టరేట్ శంకుస్థాపన కార్యక్రమానికి సంపత్ కుమార్ హాజరయ్యారు. అయితే, శిలాఫలకంపై ఆయన పేరు లేదు. దీంతో ఆయన షాకయ్యారు.

Bitter experience to Congress MLA Sampath Kumar

శిలాఫలకాలపై ప్రొటోకాల్ ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల పేర్లు ఉండాలి. కానీ సంపత్ కుమార్ పేరు లేదు. దీనిపై సంపత్ మంత్రి లక్ష్మారెడ్డితో వాగ్వాదానికి దిగారు.

ప్రోటోకాల్ ప్రకారం తన పేరు ఉండాలని, ఎందుకు లేదని నిలదీశారు. లక్ష్మారెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

చివరకు అధికారులు చేసిన తప్పిదం వల్ల సంపత్ కుమార్ అలిగి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress MLA Sambath Kumar faced bitter experience in Jogulamba Gadwal district on wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి