హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు
Special Trains from Charlapalli: అయ్యప్పస్వామి భక్తుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేరళలోని వివిధ స్టేషన్లకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ఈ క్రమంలో తాజాగా చర్లపల్లి నుంచి కేరళ మీదుగా కర్ణాటకలోని మంగళూరు వరకు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం సీజన్ లో కూడా ప్రయాణికుల రద్దీని అధిగమించేలా ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రానున్నారు.
అయ్యప్పస్వామి భక్తులు లక్షల సంఖ్యలో మాలధారణ చేస్తోన్నారు. దశలవారీగా వారంతా కూడా శబరిమలకు తరలి వెళ్తుంటారు. మెజారిటీ స్వాములు రైళ్ల మీదే ఆధారపడతారు. వారి కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేరళలోని వివిధ స్టేషన్లకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు. ఈ క్రమంలో తాజాగా విశాఖపట్నం నుంచి కొల్లం స్టేషన్ కు పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు.

పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
- ఈ నెల 24, 28వ తేదీన రాత్రి 11:30 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07267, 97269 ప్రత్యేక రైళ్లు మూడో రోజు తెల్లవారు జామున 6:55 నిమిషాలకు మంగళూరుకు చేరుకుంటాయి
- ఈ నెల 26వ తేదీన ఉదయం 9:55 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07268, 07270 ప్రత్యేక రైళ్లు మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు చర్లపల్లికి చేరుకుంటాయి.
- నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, పెరంబూరు, కాట్పాడి, జోలార్ పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ, షోరనూర్, తిరూర్, కోజికోడ్, వడకర, తలస్సేరి, కన్నూర్, కాసర్ గాడ్ మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications