హెచ్చరిక!: దూకుడుకు ఢిల్లీ బ్రేక్, రేవంత్‌కు రివర్స్, ఇక చక్రం తిప్పలేరా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పినట్లుగా ఇక తిప్పలేరా? పదవి నుంచి మొదలు పార్టీలో వ్యక్తిగత హవా వరకు ఆయన హవా కొనసాగే అవకాశాలు లేవా? అంటే అవునని అంటున్నారు.

Revanth Reddy resignation High drama : "రాజీనామా" చెయ్యలేదంటగా ? | Oneindia Telugu

సస్పెన్స్, రేవంత్ రాజీనామా: కారణాలు అంతు చిక్కడం లేదు, టీడీపీ ఎందుకలా?

టీఆర్ఎస్, టిడిపి వ్యాఖ్యలు నిజమవుతున్నాయా?

టీఆర్ఎస్, టిడిపి వ్యాఖ్యలు నిజమవుతున్నాయా?

పదవిపై ఆలస్యం, నేతల మాటలు చూస్తుంటే రేవంత్ రెడ్డి ఏకచత్రాదిపత్యం కాంగ్రెస్ పార్టీలో చెల్లుబాటు కాదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ మహా సముద్రం అని, అందులో రేవంత్ ఓ చుక్క అని ఇప్పటికే టీఆర్ఎస్, టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. అది నిజమే అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వరుసగా రేవంత్ రెడ్డికి హెచ్చరికలు

వరుసగా రేవంత్ రెడ్డికి హెచ్చరికలు

రేవంత్ రెడ్డి వ్యక్తిగత పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అనుమతి లభించదని చెబుతున్నారు. పార్టీలో వ్యక్తిగత అజెండా, సొంత అజెండా ఉండదని రేవంత్‌కు నేతలు వరుసగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. టిడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ టీడీపీ అంటే రేవంత్ గుర్తుకు వచ్చేవారు. ఆయనదే హవాగా నడిచింది. కానీ కాంగ్రెస్‌లో ఆయనకు ఇప్పటి వరకు పదవి విషయం తేలలేదు. ఆయన రాకపై పార్టీలో కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు కూడా.

వ్యక్తిగత పాదయాత్రకు అనుమతి ఉండదు

వ్యక్తిగత పాదయాత్రకు అనుమతి ఉండదు

రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే కొడంగల్ నుంచి మళ్లీ ఆయనే గెలుస్తాడని కోమటిరెడ్డి వెంకట రెడ్డి చెప్పారు. తామంతా ఆయనకు ప్రచారం చేస్తామన్నారు. రేవంత్ పాదయాత్రపై వార్తలు రావడంపై స్పందిస్తూ.. ఒక్కరి పాదయాత్రకు కాంగ్రెస్‌లో అనుమతి ఇవ్వరని చెప్పారు.

ఒప్పుకున్నా అలా అంగీకారం

ఒప్పుకున్నా అలా అంగీకారం

గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తానంటే గులాం నబీ ఆజాద్ ఒప్పుకోలేదని, తాను, భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేస్తామని చెప్పినా అనుమతివ్వలేదన్నారు. ఇప్పుడు కూడా ఒప్పుకుంటారని అనుకోవడం లేదన్నారు. ఒప్పుకున్నా అందరూ కలిసి పాదయాత్ర చేయడం లేదా బస్సు యాత్ర చేయడం ఉంటుందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress Party Break to Kodangal MLA Revanth Reddy's speed in party. Party may not agreed for His Padayatra.
Please Wait while comments are loading...