హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రైవర్ నాగరాజు హత్య, వారి మధ్య అసహజ సంబంధం: ఐఏఎస్ ఆఫీసర్, కొడుకు అరెస్ట్

భాగ్యనగరంలో ఐఏఎస్ అధికారి భార్య కారు డ్రైవర్ నాగరాజు హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో పోలీసులు ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర రావు, ఆయన తనయుడు సుక్రును అరెస్టు చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్: భాగ్యనగరంలో ఐఏఎస్ అధికారి భార్య కారు డ్రైవర్ నాగరాజు హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో పోలీసులు ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర రావు, ఆయన తనయుడు సుక్రును అరెస్టు చేశారు. వారిని మీడియా పోలీసులు మంగళవారం రాత్రి మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

పోలీసులు వివరాలను వెల్లడించారు. డ్రైవర్ నాగరాజు, ఐఏఎస్ కొడుకు సుక్రు మధ్య అసహజ సంబంధం ఉందని తెలిపారు. ఇరువురు తాగిన మైకంలో గొడవ పడ్డారని చెప్పారు. ఆ సమయంలో సుక్రూ ఇటుకతో కొట్టి చంపాడని చెప్పారు.

హత్య తర్వాత సుక్రూ.. ఐఏఎస్ అయిన తన తండ్రికి సమాచారం ఇచ్చాడని చెప్పారు. మృతదేహాన్ని మాయం చేసేందుకు సుక్రూ, అతని తండ్రి ఐఎస్ అధికారి ప్రయత్నం చేశారని చెప్పారు.

<strong>భార్యకు దూరంగా ఐఎఎస్: డ్రైవర్ హత్య కేసులో పాత్ర, స్వలింగ సంపర్క కోణం</strong>భార్యకు దూరంగా ఐఎఎస్: డ్రైవర్ హత్య కేసులో పాత్ర, స్వలింగ సంపర్క కోణం

Driver murder: IAS officer and son arrested

హత్య ఈ నెల 17వ తేదీన జరిగిందని చెప్పారు. అపార్టుమెంట్ వద్ద సెక్యూరిటీ లేని విషయం గమనించిన సుక్రూ, డ్రైవర్ నాగరాజు తాగేందుకు వెళ్లారని, అక్కడే ఈ హత్య చోటు చేసుకుందన్నారు.

ఆ రోజు మద్యం తాగిన తర్వాత అసహజ శృంగారానికి వెంకట్ సుక్రూ బలవంతం చేశాడని, నాగరాజు దీనికి అంగీకరించలేదని, దీంతో ఇటుకతో మోది హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం తన తండ్రికి ఫోన్ చేసి విషయం వివరించాడన్నారు.

అదే సమయంలో శవాన్ని మాయం చేసేందుకు సుక్రు రెండుసార్లు ప్రయత్నించాడని, అయితే స్థానికుల అలికిడితో పరారయ్యాడని చెప్పారు.

ఎట్టకేలకు ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు కూడా రంగప్రవేశం చేశారని, సీసీపుటేజ్‌లో ఆయన కూడా కనిపించడంతో ఆయనను కూడా అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

English summary
The murder of driver Bhukya Nagaraju alias Nagu ensued from a heated argument between him and 24-year-old Venkatesh Sukreet, son of IAS officer G Venkateswar Rao. Nagaraju was found to have been bludgeoned to death on Friday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X