ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొంగేమో అనుకుని.. కానిస్టేబులును కొట్టారు...

రోడ్డు పక్కన బైక్. అతడు చుట్టూ చూశాడు. దగ్గరలో ఎవరూ లేరు. బైక్ కవరులోని డాక్యుమెంట్లు బయటకు తీసి చూస్తున్నాడు.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

కొత్తగూడెం: రోడ్డు పక్కన బైక్. అతడు చుట్టూ చూశాడు. దగ్గరలో ఎవరూ లేరు. బైక్ కవరులోని డాక్యుమెంట్లు బయటకు తీసి చూస్తున్నాడు. కొంచెం దూరంలోగల కారులో కూర్చుని మాట్లాడుకుంటున్న ఆ బైక్ యజమాని, అతడి స్నేహితుడు గమనించారు. 'ఎవడో దొంగ వచ్చాడు. బైక్ దొంగతనం చేస్తున్నాడు' అనుకుని, కోపంతో ఊగిపోయారు.

'దొరికాడ్రా.. దొంగ' అనుకుంటూ పరుగెత్తుకుంటూ బైక్ వద్దకు వెళ్లారు. డాక్యుమెంట్లను చూస్తున్న ఆ వ్యక్తిపై ఒక్కసారిగా దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. దెబ్బలు తిన్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా..? సివిల్ డ్రెస్సులో ఉన్న హెడ్ కానిస్టేబుల్...

అసలేం జరిగిందంటే...

ఆదివారం ఉదయం పాల్వంచలో ఈ ఘటన జరిగింది. ట్రాఫిక్ ఎస్సై రాజు, ఆదివారం ఉదయం పాల్వంచలోని బస్టాండ్ సెంటరుకు జీపులో వచ్చారు. ఆయన వెంట హెడ్ కానిస్టేబుల్ అక్కులు ఉన్నారు. ఆ సెంటరులో నంబర్ లేని బైక్ పార్క్ చేసి ఉంది. ఆ బండి ఓనరును తీసుకురావాలని హెడ్ కానిస్టేబులును ఎస్సై పంపించారు. ఆ కానిస్టేబుల్ వెళ్లి చూశారు.

Feel like thief... beat the constable

చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. బైకులోని డాక్యుమెంట్లను బయటకు తీసి పరిశీలిస్తున్నారు. ఆయన సివిల్ డ్రెస్సులో ఉన్నారు. కొంచెం దూరంలోగల కారులో ఆ బైక్ ఓనర్, అతడి స్నేహితుడు ముచ్చట్లాడుకుంటున్నారు. బైకులోని డాక్యమెంట్లను ఎవరో బయటకు తీసి చూస్తుండడాన్ని గమనించారు. బైక్ దొంగేమో అనుకున్నారు. కోపమొచ్చింది.

'దొరికాడ్రా.. దొంగ' అనుకుంటూ పరుగెత్తుకుంటూ బైక్ వద్దకు వెళ్లారు. డాక్యుమెంట్లను చూస్తున్న ఆ వ్యక్తిపై ఒక్కసారిగా మీద పడ్డారు. తీవ్రంగా కొట్టారు. బైక్ కాగితాలను బయటకు ఎందుకు తీశావని అడుగుతూ కొడుతూనే ఉన్నారు. తాను కానిస్టేబులునని అతడు చెబుతున్నప్పటికీ... ఆవేశంతో ఊగిపోతున్న ఆ ఇద్దరు వినిపించుకునే పరిస్థితిలో లేరు.

ఇంతలో ఎస్సై అక్కడకు వచ్చారు. విషయం చెప్పారు. దాడి చేసిన ఆ ఇద్దరు నాలుక కరుచుకున్నారు. సివిల్ డ్రెస్సులో ఉండడం, బైక్ డాక్యుమెంట్లు బయటకు తీయడంతో దొంగేమోనని అనుకున్నామని, పొరపాటు జరిగిందని, క్షమించాలని ఎస్సైని ఆ ఇద్దరు వేడుకున్నారు. వారిని ఆ ఎస్సై ఏమీ అనకుండా వదిలేశారు. అదీ సంగతి...

English summary
Feel like thief... beat the constable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X