వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమం.!21ఫుట్ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం.!పాదచారులకు ఎంతో సౌకర్యం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్ మహా నగరానికి మరికొన్న సొబగులు అద్దుతున్నారు నగర పాలక సంస్ధ అధికారులు. నగర ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించడంలో రాజీలేని పోరాటం చేస్తున్న నగర పాలక సంస్ధ మరో బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్ పరిధిలో 127 .35 కోట్ల రూపాయల వ్యయంతో పాదచారుల సౌకర్యం కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలను జిహెచ్ఎంసి ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా సామాన్య ప్రజలు రోడ్ల పైన నడవాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్ల దాటడం దాదాపు సాద్యం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమస్యలను గుర్తించి ప్రజల అవసరాలకు తగ్గట్టు జిహెచ్ఎంసి అధ్వర్యంలో మౌలిక సదుపాయాలు కల్పించే సంకల్పంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో 21ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలను చేపట్టారు. ముందుగా ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టి ప్రజలకు అందుబాటులో పెట్టనున్నారు. మొత్తం నగరంలో సుమారు 4 ప్యాకేజీల ద్వారా 127 కోట్ల 35లక్షల రూపాయల వ్యయంతో 21 ఫుట్ ఓవర్ బ్రిడ్జి ల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రతిపాదించారు నగర పాలక సంస్ధ అధికారులు.

GHMC Innovative Program.!Construction of 21 Footover Bridges!Very comfortable for pedestrians.!

మొదటి ప్యాకేజీ క్రింద ఎల్.బి నగర్ జోన్ లో 35 కోట్ల 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 6 పనులను సర్కిల్ లో 2 బ్రిడ్జి లు, ఐదవ సర్కిల్ లో 3, 2 సర్కిల్ లో 1 ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు సంమందించిన పనులు వివిధ దశల్లో కోనసాగుతున్నట్టు అధికారలు స్పష్టం చేస్తున్నారు. రెండవ ప్యాకేజీ క్రింద చార్మినార్ జోన్ లో 22 కోట్ల 90 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 3 పనులలో 8వ సర్కిల్ లో 2 , 11 సర్కిల్ లో ఒకటి, మూడవ ప్యాకేజీలో సికింద్రాబాద్ లో నిర్మిణ పనులు జరుగుతున్నట్టు అధికారుల చెప్తున్నారు.

GHMC Innovative Program.!Construction of 21 Footover Bridges!Very comfortable for pedestrians.!

ఇక ఖైరతబాద్ జోన్లలో 29.65 కోట్ల రూపాయల వ్యయంతో 6 పనులలో 2 పనులు ఖైరతబాద్ జోన్ లో చురుగ్గా కొనసాగుతున్నట్టు అధికారులు వివరించారు. అంతే కాకుండా 17,18 సర్కిల్లో మిగితా నాలుగు సికింద్రాబాద్ జోన్ లో 4 బ్రిడ్జి పనులు 28వ సర్కిల్ లో 2 పనులు, 29, 30 సర్కిళ్ల లో ఒక్కక్కటి చేపట్టారు. 4వ ప్యాకేజీలో భాగంగా శేరిలింగంపల్లి, కూకట్ పల్లి జోన్లలో 39.70 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6 నిర్మణాలు చేపట్టినట్టు జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

GHMC Innovative Program.!Construction of 21 Footover Bridges!Very comfortable for pedestrians.!

ఆ నిర్మాణాల్లో భాగంగా పనులలో 2 కూకట్ పల్లి జోన్ లో 24, 25 సర్కిల్ లో ఒక్కొక్కటి చొప్పున శేరిలింగంపల్లి జోన్ లో 4 పనులలో 21 సర్కిల్ లో 2 బ్రిడ్జి పనులు 19, 20 సర్కిల్ లో ఒక్కొక్కటి చొప్పున ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలను చేపట్టగా అవి నిర్మాణాల తుది దశలో ఉన్నాయని అదికారులు వివరిస్తున్నారు. మొత్తం 21పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు వివిధ అభివృద్ది దశల్లో కొనసాగుతున్నాయని, పనులు నిర్దేశించిన కాల వ్యవదిలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు నగరపాలక సంస్ధ అదికారులు స్పష్టం చేస్తున్నారు.

English summary
The city government, which has been fighting uncompromisingly to provide basic amenities to the people of the city, has embarked on another massive program. GHMC has ambitiously undertaken the construction of foot over bridges for pedestrian comfort in the greater area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X