ఆవిష్కరణల్లో తెలంగాణ రైజింగ్, భవిష్యత్ కు కీలకం..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు. ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు జరుగుతోంది. సోమ, మంగళవారాల్లో ఇది కొనసాగనుంది. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
వికసిత్ భారత్ దిశగా తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందని గవర్నర్ తెలిపారు. నిర్ణీత లక్ష్యాలు నిర్దేశించుకుని తెలంగాణ ముందుకెళ్తోందని వివరించారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభోపన్యాసంలో పలు అంశాల ను ప్రస్తావించారు. 2047లోగా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలనేది లక్ష్యమన్న గవర్నర్, మహిళా రైతులను పలు విధాలుగా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. బస్సుల నిర్వహణ కూడా మహిళా సంఘాలకు ఇచ్చామని గుర్తు చేశారు. తమది స్థిరమైన, పారదర్శకమైన ప్రభుత్వమని పేర్కొన్నారు. ఆవిష్కరణల్లో తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ముందుందని తెలిపారు. విమానాశ్ర యాలు, రైల్వేలు, రోడ్ల విస్తరణ దిశగా చర్యలు చేపట్టామని వివరించారు. సినీ, పారిశ్రామిక, సామాజిక ప్రముఖులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

హీరో నాగార్జున తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నామని.. ఇక్కడ వాతావరణం బాగుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అన్నపూర్ణ స్టూడియో ఉందని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో మరో స్టూడియో నిర్మాణానికి బాలీవుడ్ ప్రముఖులు కలిసి ముందుకు రావడం మంచి పరిణామమని చెప్పుకొచ్చారు.
అందరూ కలిసి వస్తే ప్రపంచ వ్యాప్త ఫెసిలిటీస్‌తో పెద్ద నిర్మాణం చేయవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న ఫ్యూచర్ సిటీ ఆలోచన బాగుందని నటుడు నాగార్జున ప్రశంసించారు. సమ్మిట్ వేదిక దగ్గర స్టాళ్లను సీఎం రేవంత్ పరిశీలించారు . నోబెల్ గ్రహీతలు బెనర్జీ, కైలాశ్ ప్రసంగించారు. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ సదస్సు జరగుతోంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications