తెలంగాణ సర్కారుకు హైకోర్టులో మరో షాక్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ జీవో-39 తీసుకురావడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎంపిటీసీల ఫోరం కన్వీనర్ మనోహర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మంగళవారం ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. నాయకుల కమీషన్ల కోసమే జీవో-39ను తీసుకొచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి వాదించారు. జీవో 39తో రెవెన్యూ వ్యవస్థ బలహీన పడుతుందని చెప్పుకొచ్చారు. అందువల్ల ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు.

High court on GO 39

వాదనలు విన్న హైకోర్టు.. రైతు సమితులకు విడుదల చేసిన రూ. 500కోట్లను ఏ విధంగా ఖర్చు చేస్తారో తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు రూ. 500కోట్ల నుంచి ఎలాంటి చెల్లింపులు జరపొద్దంటూ స్పష్టం చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High court given shocks to Telangana government on GO 39.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి