Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెరువుల పక్కన ప్రభుత్వ భూములపై హైడ్రా కమిషనర్ కీలక ఆదేశాలు!

హైదరాబాద్, మాదాపూర్ లోని తమ్మిడికుంట, సున్నం చెరువుల అభివృద్ధి పనులపై కీలక ఆదేశాలు ఇచ్చిన హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ కీలకఆదేశాలు జారీ చేశారు.చెరువుల పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూములపై కీలకప్రకటన చేశారు. చెరువుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూములను పూర్తిస్థాయిలో పరిశీలించి, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న భూములను చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి ప్రక్రియలో భాగం చేయాలని స్పష్టం చేశారు.

తమ్మిడికుంట, సున్నం చెరువులను పరిశీలించిన హైడ్రా కమీషనర్

భూములకు సంబంధించిన అంశంలో ఆక్రమణదారుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు తమ్మిడికుంట, సున్నం చెరువులను స్వయంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, కీలక విషయాలను వెల్లడించారు.

HYDRA Commissioner AV Ranganath Cracks Down on Lake Encroachments in Hyderabad key directives

ప్రముఖ పర్యాటక కేంద్రంగా తమ్మిడికుంట

రాబోయే రెండు నెలల్లో చెరువుల అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు గడువు విధించారు. ఈ కాలవ్యవధిలోగా పనులు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలను గుర్తుచేస్తూ, ఐటీ కారిడార్‌కు దగ్గరగా ఉన్న తమ్మిడికుంటను ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కమిషనర్ రంగనాథ్ అన్నారు.

చెరువు దగ్గర ఆహ్లాదం

ఇక్కడికి వచ్చే సందర్శకులకు మానసిక ప్రశాంతత లభించేలా, ఒత్తిడి దూరం అయ్యేలా వాతావరణాన్ని సృష్టించాలన్నారు. చెరువు చుట్టూ దట్టమైన పచ్చదనం పెంపొందించడం ద్వారా బయటి ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూడాలని ఆదేశించారు.చెరువు చుట్టూ పాత్‌వేలు, సందర్శకులు సేద తీరేందుకు వీలుగా విశాలమైన సీటింగ్ వ్యవస్థ, అందమైన పార్కులు, పచ్చని గడ్డి ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు.

ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలి

సున్నం చెరువు సమీపంలోని సర్వే నెంబర్లు 30, 31లలో గల ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలని, అంగుళం కూడా ఆక్రమణకు గురికాకుండా వాటిని పరిరక్షించాలని ఆదేశించారు. అలాగే, తమ్మిడికుంటకు పైభాగంలో, దిగువన ఉన్న ప్రభుత్వ భూములపై హక్కులు క్లెయిమ్ చేస్తున్న వారి పత్రాలను పరిశీలించాలని సూచించారు. తమ్మిడికుంట చెరువును ఎంత సుందరంగా తీర్చిదిద్దుతున్నా, పైభాగంలో చెత్తాచెదారం, వ్యర్థాలు వేయడం వల్ల నీరు మళ్లీ కలుషితమయ్యే ప్రమాదం ఉందని కమిషనర్ హెచ్చరించారు.

ఏపీ బాటలో తెలంగాణా: వాట్సప్ తో మీ అరచేతిలోనే ప్రభుత్వ సేవలు!
ఏపీ బాటలో తెలంగాణా: వాట్సప్ తో మీ అరచేతిలోనే ప్రభుత్వ సేవలు!

పనులు త్వరగా పూర్తి చెయ్యాలని ఆదేశం

సున్నం చెరువును ఆనుకుని వెళ్తున్న హైటెన్షన్ వైర్ల కింద ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించాలని కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో రహదారి విస్తరణ చర్యలు చేపట్టడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను తీర్చాలని, ప్రజలకు మెరుగైన రవాణా మార్గాన్ని అందించాలని సూచించారు. పనులన్నీ సకాలంలో, నాణ్యతతో జరిగేలా చూడాలని కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+