'రేవంత్ రాజీనామా ఎక్కడ'?: 'పులిని చూసి నక్కవాతలు పెట్టుకొన్నట్టేనా'?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి రాజీనామాపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్‌ల మధ్య అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీ దగ్గర ఎదురుపడ్డ వీరిద్దరూ రేవంత్‌రెడ్డి రాజీనామాపై చర్చించుకొన్నారు.

'ఒరిజినల్ ఎన్టీఆరే ఓడిపోయారు: డూప్లికేట్ ఎన్టీఆర్ ఎంత'?

రేవంత్ రాజీనామా ఎక్కడ ఆగిందనే విషయమై చర్చించారు. అయితే రేవంత్ రాజీనామా లేఖ ఇంకా స్పీకర్ వద్దకు రాలేదని టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వద్ద ప్రస్తావించారు.

 interesting conversation between TRS Mla jeevan Reddy Congress Mla Sampath kumar

అటమొదలయిందన్న రేవంత్‌రెడ్డి ఎక్కడకు పోయాడని టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ ‌రెడ్డి సంపత్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే పులి అవుతుందా... అని జీవన్‌రెడ్డి అన్నారు.

అయితే టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కూడ ఘాటుగానే సమాధానమిచ్చారు. అసలు రేవంత్ రాజీనామా గురించి అడిగే దమ్ము టీఆర్ఎస్ కి లేదు... అలాగే టీఆర్ఎస్ దగ్గర ఆయుధాలు లేవు.. కాంగ్రెస్ ఆయుధాలే వాడుకోవాలి... అంటూ కాంగ్రెస్ సభ్యుడు సంపత్ అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is a interesting conversation between Trs Mla Jeevan Reddy and Congress Mla Sampath kumar at Assembly on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి