Boy Kidnap: కిడ్నాప్‌ కేసు విషాదాంతం.. హత్య చేసి బావిలో పడేసిన నిందితుడు..

జనగామ జిల్లా కొడకండ్లలో రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన బాలుడు హత్యకు గురయ్యాడు. బాబును ఎత్తుకెళ్లిన నిందితుడు బాలుడిని చంపి బావిలో పడేశాడు. నిందితుడు మహబూబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా తాజీపూర్‌ గ్రామానికి చెందిన 8 కుటుంబాల వివిధ గ్రామాల్లో తిరుగుతూ సంచార జీవనం చేస్తుంటారు.వారు నెల రోజుల క్రితం కొడకండ్లకు వచ్చి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద గుడిసెలు వేసుకున్నారు.

ఉదయం 8 గంటలకు

ఉదయం 8 గంటలకు

కొందరు కట్టెకోత మిల్లులో పని చేస్తుండగా మరికొందరు గుడారాల వద్ద అల్యూమినియం వస్తువులు తయారు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ కుటుంబాల్లో జమీల్ కుటుంబం ఒక్కటి. జమాల్ కట్టెకోత మిల్లులో పని చేస్తున్నాడు. ఈ నెల 18న ఉదయం 8 గంటలకు జమీల్‌ సూర్యాపేట జిల్లా తిర్మలగిరిలోని కట్టెకోత మిల్లులో పని చేసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్లాడు.ఆ సమయంలో జమీల్ కొడుకు సాబీర్‌ గుడారం బయట ఇతర పిల్లలతో ఆడుకుంటున్నాడు.

సినిఫక్కీలో

సినిఫక్కీలో

ఉన్నట్టుండి సాబీర్ కనిపించకుండా పోయాడు. వెంటనే స్పందించిన తల్లి తన భర్త జమీల్ కు ఫోటే చేసింది. జమీల్ హుటాహుటిన అక్కడికి చేరుకుని కొడుకు కోసం వెతికారు. ఎంత వెతికినా సాబీర్‌ ఆచూకీ లభించలేదు. దీంతో జమీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి బాలుడి గాలింపు చేపట్టారు. నిందితుడిని సినిఫక్కీలో వెంబడించిన పోలీసులు తిరుమలగిరి సమీపంలో మహబూబ్‌ను అరెస్ట్‌ చేశారు.

బావిలో బాలుడి శవం

బావిలో బాలుడి శవం

అయితే నిందితుడు బాలుడి చంపి బావిలో పడేశాడు. కాగా నిందితుడు మహబూబ్‌.. బాలుడి తండ్రి జమాల్‌కు వరుసకు అల్లుడుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. బాలుడు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+