మింగుడుపడని పరిణామం: రేవంత్ వచ్చే లోగా.. కోమటిరెడ్డి 'ఛలో అసెంబ్లీ' వ్యూహం వెనుక?

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని ముక్త కంఠంతో చెప్పే కాంగ్రెస్ పార్టీ.. నాయకత్వం విషయంలో మాత్రం ఇంతవరకు ఏకాభిప్రాయం సాధించలేకపోయింది. భవిష్యత్తులోను అది సాధ్యపడే సూచనలు కనుచూపు మేరలో కనిపించడం లేదు.

  టిడిఎల్పీ సమావేశాన్ని రద్దు చేసుకుని, కంప్యూటర్, ఫైళ్ళను తీసుకెళ్ళిన రేవంత్ | Oneindia Telugu

  ఆ సాహసం చేస్తారా?: బాబు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే.. రేవంత్ వ్యూహమిదే!

  కానీ పార్టీలోకి రేవంత్ వస్తున్నాడనగానే అందరి స్వరం ఒకేలా వినిపించింది. రేవంత్ వస్తే పార్టీ బలోపేతం అవడంతో పాటు, టీఆర్ఎస్ ను మరింత గట్టిగా ఢీకొట్టనవచ్చునని నేతలు భావిస్తున్నారు. ఈ విషయంలో సీనియర్లకు కొన్ని అసంతృప్తులు ఉన్నప్పటికీ.. నచ్చజెప్పో, బుజ్జగించో వారిని సైలెంట్ చేయించాలనే యోచనలో తెర వెనుక జైపాల్ రెడ్డి పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

  మింగుడుపడని పరిణామం:

  మింగుడుపడని పరిణామం:

  ఎవరి విషయమెలా ఉన్నా.. ఈ పరిణామాలు నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. పార్టీ పగ్గాలు చేపట్టాలన్న తన ఆకాంక్షకు రేవంత్ రెడ్డి రాక గండికొట్టే ప్రమాదాన్ని తీసుకురావడంతో.. ఆయన రాక కన్నా ముందే తన సత్తా ఏంటో చాటాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ఛలో అసెంబ్లీ వ్యూహాన్ని పకడ్బంధీగా అమలు చేసే కసరత్తుల్లో నిమగ్నమయ్యారు.

  ఛలో అసెంబ్లీ:

  ఛలో అసెంబ్లీ:

  అక్టోబర్ 27న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. మరోపక్క రైతులతో ఛలో అసెంబ్లీ నిర్వహించేందుకు కోమటి రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తన రాజకీయ ఉనికిని గట్టిగా చాటాలనుకుంటున్నారు. తద్వారా తన పొలిటికల్ మైలేజీ పెరగడంతో పాటు, పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆయన భావిస్తున్నారు.

  రేవంత్‌కు చెక్ పెట్టాలంటే:

  రేవంత్‌కు చెక్ పెట్టాలంటే:

  రేవంత్ పార్టీలోకి వస్తున్నవేళ.. అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేసి చూపించడం కోమటిరెడ్డికి రాజకీయ అనివార్యతగా మారింది. పార్టీలో మున్ముందు రేవంత్ రెడ్డి డామినేషన్ పెరిగిపోయే అవకాశం ఉండటంతో.. ఆ పరిస్థితిని ఎదుర్కోవాలంటే తాను ధీటుగా నిలబడాలనే ఆలోచనలో కోమటిరెడ్డి ఉన్నారు. మిగతా సీనియర్ల ఆలోచన ఎలా ఉన్నప్పటికీ.. పార్టీలో రేవంత్ కు ఇచ్చే ప్రాధాన్యత విషయంలో కోమటిరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపే సూచనలున్నాయి.

  రేవంత్ కన్నా దూకుడుగా ఉండాలని

  రేవంత్ కన్నా దూకుడుగా ఉండాలని

  రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చాక తన దూకుడుతో చాలామందిని తనవైపు తిప్పుకునే అవకాశం ఉంది. వెనుక నుంచి జైపాల్ రెడ్డి మద్దతు ఎలాగూ ఉంటుంది. పార్టీలో తనకంటూ ఓ అనుకూల వర్గం ఏర్పడితే ఆయన దూకుడును అడ్డుకోవడం కోమటిరెడ్డికి మరింత కష్టంగా మారుతుంది. కాబట్టి రేవంత్ కన్నా ముందు తానే దూకుడుగా వ్యవహరించాలని కోమటిరెడ్డి భావిస్తున్నారు. తనకు అవకాశం ఇస్తే పాదయాత్ర చేసి పార్టీని గెలిపిస్తానని గతంలో చెప్పిన ఆయన.. ఆ అవకాశం కోసం ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress senior leader Komati Reddy Venkat Reddy planning for Chalo Assembly on October 27th, this is the strategy behind that

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి