తెలంగాణ శాసనమండలిలో అరుదైన సందర్భం-ఒకేరోజు ఛైర్మన్,డిప్యూటీ ఛైర్మన్ పదవులు ఖాళీ
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌ల పదవీ కాలం గురువారం(జూన్ 3)తో ముగిసింది. ఛైర్మన్,డిప్యూటీ ఛైర్మన్ ఇద్దరి పదవి ఒకేరోజు ముగియడం... కరోనా నేపథ్యంలో ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండవని ఈసీ గతంలోనే స్పష్టం చేయడంతో ప్రొటెన్ ఛైర్మన్ ఎంపిక తప్పనిసరి అయింది. దీంతో ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని ప్రభుత్వం ప్రొటెం ఛైర్మన్‌గా ఖరారు చేయగా... గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అందుకు ఆమోదం తెలిపారు. తదుపరి మండలి ఛైర్మన్‌ను ఎన్నుకునేంతవరకూ ఆయన ప్రొటెం ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.
మండలిలో ఛైర్మన్,డిప్యూటీ ఛైర్మన్ ఇద్దరి పదవి ఒకేసారి ముగియడం అరుదైన సందర్భం అని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలా ఒకేసారి ఇద్దరి పదవీకాలం ముగిసిన సందర్భాలు అరుదుగా ఉన్నాయంటున్నారు. సాధారణంగా ఛైర్మన్ పదవి ముగిస్తే... డిప్యూటీ ఛైర్మనే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అయితే ప్రస్తుతం ఇద్దరి పదవి ఒకేసారి ముగియడంతో రాజ్యాంగ మార్గదర్శకాల ప్రకారం సీనియర్ సభ్యుడిని ప్రొటెం ఛైర్మన్‌గా నియమించారు. ఎమ్మెల్సీ రాజేశ్వరరావు,నారదాసు లక్ష్మణ్ రావు పేర్లను కూడా ఇందుకోసం పరిశీలించినప్పటికీ చివరకు భూపాల్ రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గుచూపింది.

గుత్తా సుఖేందర్ రెడ్డి,నేతి విద్యా సాగర్‌లతో పాటు చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఆకుల లలిత, ఫరీదుద్దీన్‌ల ఎమ్మెల్సీ పదవి కాలం కూడా నేటితో ముగిసింది. సాధారణంగా పదవీకాలం పూర్తయ్యేలోపు ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ఇప్పట్లో ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం గతంలోనే ప్రకటించింది. జూన్‌లో ఈ ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
Recommended Video
మండలిలో ఛైర్మన్,డిప్యూటీ ఛైర్మన్ ఇద్దరి పదవులు ఒకేసారి పూర్తయిన సందర్భం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 2011లో చోటు చేసుకుంది. అప్పటి శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, డిప్యూటీ ఛైర్మన్ ఉన్న మహ్మద్ జానీల పదవీకాలం ఒకేరోజు పూర్తయ్యాయి. దీంతో రెండు పదవులు ఒకేరోజు ఖాళీ అయ్యాయి. సీనియర్ ఎమ్మెల్సీ సింగం బసవపున్నయ్యను అప్పట్లో ప్రొటెం ఛైర్మన్‌గా నియమించారు. గవర్నర్ ఆమోదంతో ప్రొటెం ఛైర్మన్ నియామకం తర్వాత ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రొటెం ఛైర్మన్‌గా ఎన్నికన సభ్యుడు ఆ హోదాలో మండలి ఛైర్మన్ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications