ఈమెనే లక్కీ సర్పంచ్.. ఎలాగో తెలుసా..?
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఏకగ్రీవం స్థానాలు మినహాయించి ఇవాళ 3,911 పంచాయతీలు అలాగే 29,917 వార్డులకు పోలింగ్ పూర్తికాగా.. ప్రస్తుతం కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి సంబంధించిన ఫలితాలు ఒక్కో విధంగా బయటపడుతున్నాయి.
తాజాగా మెదక్ మండలం చీపురుదుబ్బ తండా సర్పంచ్ గా కేతావత్ సునీత డ్రాలో విజయం సాధించారు. మొత్తం 377 ఓట్లు ఉండగా అందులో 367 ఓట్లు పోలింగ్ అయ్యాయి. సునీత(కాంగ్రెస్), బీమిలి(బీఆర్ఎస్) తరఫున పోటీ చేయగా.. అనూహ్యంగా ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. రెండు ఓట్లు చెల్లనివి కాగా.. ఒకటి నోటాకు పడింది. అయితే ఇద్దరు అభ్యర్థులకూ సమాన ఓట్లు రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు. అందులో కాంగ్రెస్ బలపరిచిన మహిళా అభ్యర్థి కేతావత్ సునీత విజయం సాధించారు. దీంతో లక్కీ సర్పంచ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
మరోఘటనలో వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గొల్ల రమాదేవి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అలాగే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్ సర్పంచ్ గా చంద్రశేఖర్ 2 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి తండాలో కాంగ్రెస్ అభ్యర్థి హాజీ నాయక్ అలాగే నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులస్పూర్ తండాలో కాంగ్రెస్ బలపరచిన లలితా బాయ్ 5 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఇదిలాఉండగా ఎన్నికల్లో పోటీ చేసిన తన కూతురికి ఓటు వేసిన ఓ పెద్దాయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలోని 14వ వార్డులో జరిగింది. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 80.84 శాతం పోలింగ్ నమోదు అయింది. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాసేపట్లో పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications