• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిషన్ భగీరథ దేశానికి ఆదర్శం.!అక్టోబర్ 2న ఢిల్లీలో అవార్డు అందుకోబోతున్నామన్న మంత్రి హరీష్ రావు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ రెండు నాల్కల ధోరణి ఏంటని మంత్రి హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి మండిపడ్డారు. కేంద్ర మంత్రులకు ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే గతంలో సమకూర్చల్సిన 5300 కోట్లు విడుదలచేసి మాట్లాగాలని హితవు పలికారు. నీతి ఆయోగ్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అద్భుతమని, అందుకోసం 24 వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదిస్తే 24 పైసలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

గుజరాత్ కు 2500 కోట్లు ఇవ్వడం జరిగిందని, గుజరాత్ లో 15 ఏళ్ల నుంచి మంచి నీటి సరఫరా అమలు చేస్తున్నాం అని చెబుతున్నప్పటికి 100 శాతం ఇంటింటికి నల్లాల ద్వారా నీళ్లు ఇవ్వడంలో గుజరాత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందన్నారు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు.

మిషన్ భగీరధకు ప్రతిష్టాత్మక అవార్డు..

మిషన్ భగీరధకు ప్రతిష్టాత్మక అవార్డు..

కేంద్ర ప్రభుత్వం నేషనల్ జల్ జీవన్ మిషన్ ద్వారా మిషన్ భగీరథ పథకానికి, రాష్ట్ర ప్రభుత్వ పని తీరును ప్రశంసిస్తూ అక్టోబర్ 2వ తేదీన మీ రాష్ట్రానికి అవార్డు ఇస్తాం స్వీకరించడని కేంద్రం కోరడం జరిగిందని మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. ఇవాళ తెలంగాణ ప్రజలు గర్వించదగిన రోజని, తెలంగాణ పని తీరు దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా ఉందన్నారు.కేవలం ప్రశంసించడమే కాకుండా, అవార్డు స్వీకరించడంతో పాటు రాష్ట్ర పని తీరు జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి ఓ బూస్ట్ లా పని చేస్తుందని మంత్రులు స్పష్టం చేసారు.

ఇంటింటికి వందకు వంద శాతం నల్లా..

ఇంటింటికి వందకు వంద శాతం నల్లా..

అంతే కాకుండా మహిళల కష్టాలను తీర్చడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేంద్రం గతంలో చెప్పిందని, అదే విషయాన్ని మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో తెలంగాణ నిరూపించిందని మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. కేంద్రం ఓ స్వచ్చంధ సంస్థ ద్వారా తెలంగాణలో 320 గ్రామాలను, 150 కి పైగా టీంలు పెట్టి రోజుల తరబడి పర్యవేక్షించి, లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ అవార్డును అందించేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసిందన్నారు.

రెండు రోజులకో కేంద్ర మంత్రి వచ్చి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఈ అవార్డుతో అయినా వారికి కనువిప్పు కలగాలని, ఇప్పటికైనా బీజేపి నాయకులు కళ్లు తెరవాలన్నారు మంత్రులు.

తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వండి..

తెలంగాణ రాష్ట్ర పని తీరు అనేక పథకాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు. మిషన్ భగీరథ కార్యక్రమం హర్ ఘర జల్ కు ఆదర్శమయిందని అన్నారు. మిషన్ కాకతీయ దేశ వ్యాప్తంగా అమృత్ సరోవర్ కు ఆదర్శంగా మారిందని, రైతు బంధు ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన ఏకైక సీఎం చంద్రశేఖరావని అన్నారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణ దేశానికి దిక్చూచిగా నిలిచిందని, ఏడేళ్లలో అద్భుతాలు చేసి చూపిన రాష్ట్రం తెలంగాణ అని, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన ఏకైక నేత చంద్రశేఖర్ రావు అని మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేసారు.

బీజేపి ఢిల్లీలో అవార్డులు ఇస్తుంది..

బీజేపి ఢిల్లీలో అవార్డులు ఇస్తుంది..

అంతే కాకుండా కేవలం రెండేళ్లలో 59.94 టీఎంసీల నీటిని ఇంటింటికి ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదని, తెలంగాణ అధికారుల సమన్వయం, సమయస్పూర్తితోనే ఇది సాధ్యమయిందన్నారు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు. స్వచ్ఛ భారత్ కింద తెలంగాణ రాష్ట్రానికి ఏడు అవార్డులు వచ్చాయని, నిజామాబాద్ కు రెండు అవార్డులు వచ్చాయని, మొత్తం జాతీయ స్థాయిలో 13 అవార్డులు వచ్చాయన్నారు.

మిషన్ భగీరథతో 14 అవార్డులు వచ్చాయని,
తెలంగాణలో జరిగే అభివృద్ధి ప్రతీ మీటింగ్ లో కేంద్ర స్థాయిలో అభినందనలు వస్తున్నాయన్నారు. అవార్డులు ఇవ్వడమే కాకుండా రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరుతున్నామని, నిధుల కేటాయింపు అంశంలో చాలా సార్లు మోసం చేశారని మంత్రులు మండిపడ్డారు.

English summary
If the Union Ministers have love for this state, they should release the 5300 crores that had been collected in the past and talk about it. Niti Aayog expressed anger that Mission Kakatiya and Mission Bhagiratha are wonderful, but they did not give even 24 paise when they proposed to give 24 thousand crores for that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X