పార్కింగ్ ఘర్షణ: నెక్లెస్‌రోడ్డులో యువకుడి దారుణ హత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: హైదరాబాదులోని నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ ప్లాజా వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పీపుల్స్‌ ప్లాజా పార్కింగ్‌ వద్ద యువకుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు.

ఈ ఘటనలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు ఇందుకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడిపై గతంలో పంజగుట్ట పీఎస్‌లో రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Murder on Necklace road in Hyderabad

అయితే, కొందరు దుండగులు యువకుడి గొంతు కోసి హత్య చేసినట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతిచెందిన వ్యక్తిని తాఖి అలీగా గుర్తించారు. క్లూస్ టీం సిబ్బంది ఘటనాస్థలంలో దర్యాప్తు చేపట్టింది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదిలావుంటే, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. భువనగిరి మండలం బస్వాపురంలో నవీన్ అనే యువకుడిపై కొంతమంది వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రగాయాలైన యువకుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man has been killed at Necklace road in Hyderabad of Telangana.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి