మోడీ చిటికెలతో దేశం,కేసీఆర్ ఫాంహౌస్ పాలనతో రాష్ట్రం అభివృద్ది చెందలే.!ఇరు పార్టీలపై పొన్నాల ఫైర్.!
హైదరాబాద్ : బీజేపి, టీఆర్ఎస్ పార్టీలపైన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విరుచుకుపడ్డారు. ఫాంహౌస్ పాలనతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసాడని మండిపడ్డారు. ప్రధాని మోదీ వేసిన చిటికెలతో దేశం ఏమాత్రం వృద్ది సాధించలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడుతుందో అంతుచిక్కని పరిస్థితులు నెలకొన్నాయని పొన్నాల ఆవేదన వ్యక్తం చేసారు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, అరవై ఐదు లక్షల మంది రైతులు మద్దతు ధర లేక, కొనుగోలు లేక నష్టపోతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

వాస్తవాలను ప్రజలకి చెప్పడంలో కాంగ్రెస్ ముందుంటుంది.. కేసీఆర్ లాగా అబద్దాలు చెప్పమన్న పొన్నాల
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఫామ్ లో మూడు వందల నలభై ఒక్క ఎకరాల్లో సన్న ధాన్యం వేయకుండా దొడ్డు ధాన్యం వేశాడని, ఇది రైతులను వంచించే చర్య కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే మన దేశం, ఈ రాష్ట్రం ఈ స్థాయికి వచ్చిందని, వాస్తవాలను ప్రజలకి తెలియజేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందే ఉంటుందని అన్నారు. మైనార్టీలకు, ఎస్టీలకు ఆశ చూపి మోసం చేశారని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై పొన్నాల ఆగగ్రహం వ్యక్తం చేసారు.

కేసీఆర్ లోపల మోదీతో దోస్తీ.. బయట మాత్రం కుస్తీ అన్న పొన్నాల
1972 నుండి నాలుగు వందల రూపాయల నుండి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభమయ్యాయని, ఇలాంటి చరిత్ర ఏ ప్రభుత్వంలో అయినా ఉందా అని పొన్నాల ప్రశ్నించారు. ఏ గ్రామంలో నైనా ఏడున్నర సంవత్సరాల కాలంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ అయినా చంద్రశేఖర్ రావు ఇచ్చాడా అని నిలదీసారు. ఉమ్మడి రాష్ట్రంలో 55 లక్షల ఇళ్లు కట్టించామని, చంద్రవేఖర్ రావు వచ్చాక 22 లక్షల ఇళ్లు కట్టిస్తామని మాటిచ్చాడని, 22 లక్షల ఇళ్లకు లక్షా 50 వేల కోట్లు అవుతుందని,
లక్ష ఇల్లు కూడా పూర్తి చేయలేడని, సీఎం ది వందకు వంద శాతం తప్పుడు వాగ్దానమన్న అంశం ప్రజలు గుర్తించాలని పొన్నాల విజ్ఞప్తి చేసారు.

కేసీఆర్ కు గుణపాఠం తప్పదు..గద్దె ఎక్కిన వాడిని గద్దె దించడమే పరిష్కారమన్న పొన్నాల
ఉమ్మడి రాష్ట్రంలో 74 లక్షల మందికి పెన్షన్ ఇచ్చామని, మూడు సంవత్సరాల నుండి చంద్రశేఖర్ రావు ఏమైనా పెన్షన్లు ఇచ్చాడా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో లక్షల వితంతు పెన్షన్ లు పెండింగ్లో ఉన్నాయని, పెన్షన్ల విషయంలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. చంద్రశేఖర్ రావు చేస్తున్న నిర్వాకం వల్ల 65 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఇంటికో ఉద్యోగం అని ఉన్న ఉద్యోగలు చంద్రశేఖర్ రావు పీకేస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు వద్దని సీఎం చెబుతున్నాడని, రైస్ మిల్లులు ఏం కావాలని, మూడు వేల పైచిలుకు రైస్ మిల్లులు ఉన్నాయని. ఆ రైస్ మిల్లులో పనిచేసే రెండు లక్షల మంది జీవనోపాది ఏం కావాలిని పొన్నాల ప్రశ్నించారు.

తరం మారినా చరిత్ర మారదు. యువత ఈ సత్యాన్ని గ్రహించాలన్న పొన్నాల
స్వాతంత్రం వచ్చినప్పుడు మొక్కజొన్నలు అమెరికా నుండి దిగుమతి చేసుకునే వాళ్ళం కాని ఈనాడు 128 దేశాలకు ఎగుమతి చేస్తున్నామంటే ఈ దేశం కాంగ్రెస్ పార్టీ తోనే ఈ స్థాయికి వచ్చిందని, మోడీ వేసిన చిటికెలతో మాత్రం కాదని పొన్నాల అన్నారు. నోట్ల రద్దు సమయంలో చంద్రశేఖర్ రావు మోదీకి మద్దతు తెలిపాడని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు Gst 18% చేస్తామంటే మద్దతు తెలపలేదని, బిజెపి వచ్చిన తర్వాత 28 శాతం జిఎస్టి తీసుకొచ్చారని దానికి కూడా చంద్రశేఖర్ రావు మద్దతు తెలిపారని అన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది చేస్తూనే ఉంటుందని, తరం మారినా చరిత్ర మారదన్న అంశం తెలుసుకోవాల్సిన అవసరం ఈ తరానికి ఉందన్నారు పొన్నాల లక్ష్మయ్య.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications