వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమ్మె విరమణ: అర్చకులంటే కెసిఆర్‌కు ఎనలేని గౌరవమన్న ఇంద్రకరణ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న అర్చకులు శుక్రవారం విరమించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అర్చకుల డిమాండ్ల నెరవేర్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో సమ్మెను విరమించారు.

అర్చక ప్రతినిధులతో సమావేశం అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. చట్టానికి లోబడి అర్చకుల డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పారు. అర్చకుల గౌరవానికి భంగం కలగనీయమని

అర్చకులంటే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఎనలేని గౌరవమని మంత్రి ఇంద్రకరణ్ తెలిపారు. ఈ నెల 15లోగా అర్చకుల డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పారు. హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

 Priests strike cessation in Telangana

010 అమలు కాకుంటే వాటి ప్రయోజనాలు అందేలా చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. యాదాద్రిని మరో తిరుపతిలా తయారు చేస్తామని అన్నారు.

త్వరలో కొత్త రెవెన్యూ పాలసీ: డిప్యూటీ సీఎం

త్వరలోనే కొత్త రెవెన్యూ పాలసీని తీసుకొస్తామని డిప్యూటీ సీఎం మహమ్ముద్ అలీ తెలిపారు. రాష్ట్రంలో అన్ని ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఇండియాలోనే సీఎం కేసీఆర్ పని తీరుపై చర్చ జరుగుతోందని చెప్పారు. అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు.

English summary
Priests have strike cessation in Telangana on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X