విచారణ పేరుతో ఇబ్బందులు.!సహించేది లేదు.!బీజేపికి మిత్తీతో సహా చెల్లిస్తామన్న రేవంత్.!
హైదరాబాద్ : ఏఐసీసీ అగ్రనేతలను ఈడి కేసులు పెట్టి వేధించడం రోజుల తరబడి విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టడాన్ని నిరసిస్తూ, బుదవారం ఏఐసీసీ కార్యాలయంలోకి పోలీసులు చొరబడి కార్యకర్తలను, నాయకులను అరెస్టులు చేయడాన్ని ఖండిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన రాజ్ భవన్ ముట్టడి తీవ్ర ఆందోళనలు, ఉద్రిక్తతులు, అరెస్టులతో ముగిసింది. రాజ్ భవన్ ముట్టడి సందర్బంగా పోలీసులు కాంగ్రెస్ నేతలపైన క్రూరంగా వ్యవహరించారని పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి మండి పడ్డారు.

రాష్ట్ర పతి ఎన్నికల్లో పైచేయి కోసమే బిజెపి డ్రామాలు.. బొల్లారం పీఎస్ నుండి రేవంత్ ఫైర్
ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే ఈడీ కేసులు బనాయిస్తున్నారని, ప్రాంతీయ పార్టీలను బెదిరించడానికే కాంగ్రెస్ అగ్రనాయకులను ఇబ్బంది పెడుతున్నారు బొల్లారం పోలీస్ స్టేషన్ నుండి పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజ్ భవన్ ముట్టడిలో అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర పతి ఎన్నికల్లో పైచేయి కోసమే బిజెపి డ్రామాలాడుతోందని, మూసేసిన కేసుల్ని ఓపెన్ చేసి రాహుల్, సోనియాలను ఇబ్బంది పెడుతున్నారని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసారు.

శాంతి యుత నిరసనలు.. పోలీసులు రెచ్చగొట్టడంతో హింస చోటుచేసుకుందన్న రేవంత్
గత మూడు రోజులుగా చేసిన నిరసనల్లో చిన్న హింసాత్మక ఘటనలు కూడా జరగలేదని, తాను పిసిసి హోదాలో చాలో ప్రోగ్రామ్ కార్యక్రమాలు ఎన్నో రూపొందించినా ఎప్పుడూ ఒక్క చిన్న అవాఛనీయ ఘటన కూడా చోటుచేసుకోలేదన్నారు రేవంత్ రెడ్డి. గాంధీ సిద్ధాంతంలోనే నిరసనలు, ఆందోళనలు చేశామని, గురువారం కూడా రాజ్ భవన్ ముందు శాంతి యుతంగా నిరసన తెలపాలని చూశామని, తమ నాయకులు శాంతి యుతంగా నిరసన చేస్తుంటే, పోలీసులు రెచ్చగొట్టారని, లాఠీ ఛార్జి చేశారని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు.

పోలీసులు దౌర్జన్యం.. అమానుషంగా వ్యవహరించారన్న పీసిసి ఛీఫ్
అంతే కాకుండా సీఎల్పీ నేత భట్టిని పోలీసులు అమానుషంగా లాక్కెళ్లారని, రేణుక చౌదరిని మగ పోలీసులు హ్యాండిల్ చేయడం వల్ల ఆమె ఆగ్రహానికి గురయ్యారన్నారు రేవంత్. తమ నేతలకు, శ్రేణులకు పోలీసుల తోపులాటలో గాయాలయ్యాయని, గిట్లనే తెలంగాణ ఉద్యమంలో పోలీసులు వ్యవహరించి ఉంటే రాష్ట్రము వచ్చేదా అని రేవంత్ నిలదీసారు. టీఆరెఎస్ పార్టీ నాయకులు బిజెపి అభ్యర్థిని రాష్ట్రపతిగా గెలిపించుకున్నా తమకు ఇబ్బంది లేదు కానీ తమ జోలికి వస్తే సహించేది లేదన్నారు రేవంత్ రెడ్డి. తమ పార్టీ నేతలపై పెట్టిన అక్రమకేసులు ఎత్తివేయాలని పీసిసి ఛీఫ్ డిమాండ్ చేసారు.

కేంద్ర రంగ సంస్థల ముందు నిరసన.. మోదీ దిష్టి బొమ్మలు తగలబెట్టాలని రేవంత్ పిలుపు
శుక్రవారం జిల్లా కేంద్రాలలో, కేంద్ర రంగ సంస్థల ముందు నిరసన తెలపాలని, మోడీ దిష్టి బొమ్మలు తగలబెట్టాలని పార్టీ కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు. జిల్లాలోని రైల్వే స్టేషన్లు, టెలికామ్, ఎల్ఐసీ, పోస్టల్ డిపార్ట్ మెంట్ ల ముందు నిరసన తెలపాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చట్టపరంగా అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ శ్రేణులపై పెట్టిన కేసులు ఒక్క కలం పోటుతో కొత్తివేస్తామన్నారు రేవంత్ రెడ్డి. వెంటనే సోనియా, రాహుల్ లకు ఇచ్చిన ఈడీ నోటీసులు వెనక్కి తీసుకోవాలని, కాంగ్రెస్ నేతలపై లాఠీ ఛార్జి చేసిన పోలీసులపై సర్కార్ విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications