• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజగోపాల్ రెడ్డి ఏ కారణాలతో వెళ్తున్నారో నాకు చెప్పారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి..పార్టీ మార్పు ఫిక్సే

|

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారా ? కాంగ్రెస్ లో కొనసాగుతారా ? పార్టీ మారతాను అన్నట్టు మాట్లాడుతూ పార్టీ మారటం లేదని చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి . మొత్తంగా అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక ఇంతకీ ఆయన పార్టీ మారుతున్నారో లేదో క్లారిటీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి .

కాంగ్రెస్ తో తాడోపేడో తేల్చుకోనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .. సాయంత్రం కీలక ప్రకటన ?

బీజేపీవైపు మొగ్గు చూపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

బీజేపీవైపు మొగ్గు చూపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతాడా అన్న అంశం హాట్ టాపిక్ గా మారింది . కాంగ్రెస్ అధిష్టానంపైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడి బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకునే పనిలో పడ్డారని తెలుస్తుంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు, సీఎం కేసీఆర్‌ పాలనకు ఎదురొడ్డి నిలిచే శక్తి కాంగ్రెస్‌కు లేదని, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఆయన కుండబద్ధలు కొట్టి చెప్పిన నేపధ్యంలో బీజేపీవైపే ఆయన మొగ్గు చూపుతున్నట్టు అర్ధం అయ్యింది.

  కోమటిరెడ్డి కమలం గూటికి దాదాపు చేరినట్టే
  అర్దరాత్రి దాకా పార్టీ ముఖ్య అనుచరులతో మంతనాలు ... అభిప్రాయ సేకరణ

  అర్దరాత్రి దాకా పార్టీ ముఖ్య అనుచరులతో మంతనాలు ... అభిప్రాయ సేకరణ

  ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన పార్టీ మార్పుపై అభిప్రాయసేకరణ చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి దాకా తన నివాసంలో ముఖ్యనేతలతో రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. పెద్ద అంబర్‌పేటలో మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలతో కూడా ఆయన సమావేశం నిర్వహించారు. బీజేపీలో చేరికపై నేడో రేపో రాజగోపాల్‌రెడ్డి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఈ సాయంత్రం కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్న నేపధ్యంలో ఆయన ఇంకా ఏమీ తేల్చకుండా దోబూచులాడుతున్నారు.

  రాజగోపాల్ రెడ్డి పార్టీ మారటం ఫిక్సే .. ఏ కారణాలతో మారుతున్నారో చెప్పారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

  రాజగోపాల్ రెడ్డి పార్టీ మారటం ఫిక్సే .. ఏ కారణాలతో మారుతున్నారో చెప్పారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

  ఇక ముగుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంపై టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఓ క్లారిటీకి వచ్చేశారు. ఇక ఈ విషయంలో స్పందించిన ఉత్తమ్ రాజకీయ కారణాలతో వెళ్లే వారికి అయితే ఏదైనా చెప్పొచ్చునని, ఆర్థికపరమైన కారణాలతో వెళ్లేవారికి ఏం చెప్పగలమని ఆయన అభిప్రాయపడ్డారు . రాజగోపాల్‌రెడ్డి ఏ కారణాలతో వెళ్తున్నారో తనకు చెప్పారని అన్నారు. మొత్తానికి ఉత్తమ్ వ్యాఖ్యలతో ఆయన పార్టీ మారతారన్న విషయంపై అందరికీ క్లారిటీ వచ్చింది . ఇక ఆయన పార్టీ మార్పు కూడా ఆర్ధిక కారణాలతో ముడిపడి ఉందని ఉత్తమ్ చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఇక ఉత్తమ్, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సమాధానంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇప్పుడేదైనా చెబుతూ ఉండొచ్చని పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై ఏఐసీసీ పెద్దలతో చర్చిస్తానని ఉత్తమ్ పేర్కొన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  TPCC chief Uttam Kumar Reddy on the party's change of Mugugodu Congress MLA Komatireddy Rajagopal Reddy came to a clarity. Uttam, who responded to the matter, said that those who are going for political reasons can say anything, but what about those who go for economic reasons? Rajagopal Reddy said he was going for what reasons. All the clarity came about that he was going to change the party . It is interesting to note that his party's transformation is also related to economic reasons. Later, Uttam said Rajagopal Reddy had could now say anything that he has decided to go .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more