వ‌ర్మ క్రియేటివిటీ: 'బాహుబ‌లి' గెట‌ప్‌లో రేవంత్ రెడ్డి, వైరల్ గా మారిన ఫొటో..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఈ మ‌ధ్య రాజకీయాల‌పై కూడా స్పందిస్తూ మ‌రింత వేడి పుట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడం త‌న‌కు చాలా చాలా హ్యాపీ అని సోమవారం వర్మ పేర్కొన్న విష‌యం తెలిసిందే.

  Revanth Reddy Says Goodbye To TDP రేవంత్‌తో పాటు 25మంది ? | Oneindia Telugu

  చదవండి: రేవంత్ ఓట్లు కురిపించే బాహుబలి, నమ్మకం వచ్చింది: రామ్ గోపాల్ వర్మ

  రేవంత్ రెడ్డి చేరటంతో త‌న‌కు కాంగ్రెస్ పార్టీ మీద మళ్లీ నమ్మకం వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి 'బాహుబలి' అని, 'బాహుబలి' సినిమా బాక్సాఫీస్ కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి ఓట్ల వర్షం కురిపిస్తాడని వర్మ వ్యాఖ్యానించారు.

  baahubali-revanth-reddy

  ఆ ఒక్క పోస్టుతో ఆ విష‌యాన్ని వ‌దిలిపెట్టే ప్ర‌సక్తే లేదనేలా వ‌ర్మ ఇదే విష‌యంపై మ‌రోసారి స్పందిస్తూ.. 'బాహుబ‌లి గెట‌ప్‌'లో రేవంత్ రెడ్డిని చూపించారు. 'సాహోరే బాహుబ‌లి రేవంత్ రెడ్డి' అంటూ ఈ ఫొటోను తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసి అల‌రించారు.

  ఈ పోస్ట్ పై స్పందిస్తోన్న నెటిజ‌న్లు వ‌ర్మ క్రియేటివిటీని కాపీ కొట్టి త‌మ‌కు ఇష్ట‌మైన హీరోలని బాహుబ‌లిలా రూపొందించి కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి మరి!

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Director Ram Gopal Varma passed comments in his facebook page on Revanth Reddy joining in Congress Party here in Hyderabad on Monday. After that he created a photo which is showing that Revanth Reddy as Baahubali get up and posted it in his facebook page again. Now that photo goes viral in social media.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి