నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ ఫాంహౌస్ గోడలు బద్దలుకొడతాం: ఎల్లారెడ్డి సభలో రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు-మన పోరు బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యపు గింజ కొనే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని అన్నారు.

కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడిస్తాం: రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడిస్తాం: రేవంత్ రెడ్డి

ఏప్రిల్ నెల నుంచే సీఎం కేసీఆర్ ధాన్యం కొనేందుకు ఏర్పాట్లు చేయకుంటే రైతులతో కలిసి ఫాంహౌస్‌ను ముట్టడిస్తామని రేవంత్ హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీకి రెండు సార్లు అధికారం కట్టబెడితే కేంద్రంపై నెపం మోపం ఢిల్లీ వెళ్లి పోరాడతానని కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో చెరకు ఫ్యాక్టరీలు తెరుస్తామని హామీ ఇచ్చిన కవిత ఎంపీగా గెలవగానే ఆ విషయాన్ని మర్చిపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుత బీజేపీ ఎంపీ అరవింద్.. పసుపు బోర్డ్ హామీని తుంగలో తొక్కారని ఆరోపించారు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

కేసీఆర్ మళ్లీ ఢిల్లీలో అగ్గిపుట్టిస్తాడట: రేవంత్ చురకలు

రూ. 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో రూ. 10వేల కోట్లు పెట్టి ధాన్యం కొనలేరా? అని సీఎం కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నెపం కేంద్రంపై నెట్టి మరోసారి ఢిల్లీలో అగ్గి పుట్టిస్తానని కేసీఆర్ బయల్దేరుతున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామన్నారు. కేసీఆర్ ఫౌంహౌస్‌లో పండించిన ధాన్యాన్ని ఎలా కొంటారో.. పేద రైతులు పండించిన పండించిన ధాన్యం ఎలా కొనరో చూస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రైతులకు అన్యాయం చేస్తే దొడ్డు కర్రలు పట్టుకున్న సైన్యంతో వెంటాడతామన్నారు.

లక్షల మంది సైన్యంతో ఫాంహౌస్ గోడలు బద్దలుకొడతాం: రేవంత్ రెడ్డి

ఐకెపి కేంద్రాలను తెరవాలి. అవసరమై గన్ని సంచులను ప్రభుత్వం కొనుగోలు చేయాలి. లారీ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటుచేసి మిల్లర్లకు టార్గెట్ ఇవ్వాలన్నారు రేవంత్ రెడ్డి. రైతులకు అన్యాయం జరిగితే ఫార్మ్ హౌస్ గోడలను లక్షల మంది సైన్యంతో బద్దలు కొడతామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. 35 వేల మెజారిటీతో సురేందర్‌ని గెలిపిస్తే టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించే సమయం కూడా లేదు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీదే గెలుపని రేవంత్ అన్నారు. సదాలక్ష్మి, ఈశ్వరీ బాయి, బాల గౌడ్ లు చాలా మంది ఈ ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహించారు. గెలుపు ఓటములు సహజం.. దళితుడైన గంగారాం.. పార్టీ కోసం 40 ఏళ్ళు పార్టీకి సేవ చేసాడన్నారు రేవంత్ రెడ్డి. కళ్ళాల్లో కాంగ్రెస్ కార్యక్రమం భాగంగా ఇక్కడే తిరిగామన్నారు రేవంత్ రెడ్డి. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కేసీఆర్ రేపటి నుంచి కొత్త నాటకంకి తెర లేపారని, వరి ధాన్యం ఎట్లా కొనరో చూద్దామని అన్నారు. 8ఏళ్ళ నుంచి ఏం చేశావని ప్రశ్నించారు. వరి కొనుగోలు చేత కాకపోతే సీఎం పదవి నుంచి దిగిపోవాలన్నారు. ఈ సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, మదన్మోహన్ రెడ్డి, సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

English summary
Revanth Reddy slams cm kcr for rice procurement issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X