వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాహో శిరీష: కరెంట్ స్తంభాలు ఎక్కే తొలి లైన్ ఉమన్ గా శిరీష నియామకం !!

|
Google Oneindia TeluguNews

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్ అని ముక్కు తిమ్మనార్యుడు చెప్పినట్టుగా మహిళలు ఏ పనైనా ఇట్టే నేర్చుకుంటారు. పురుషులతో దీటుగా పని చేస్తారు. ఇక అదే విషయాన్ని నిరూపించింది తెలంగాణలో తొలి లైన్ ఉమన్ గా రికార్డు సృష్టించిన శిరీష అనే యువతి. మగవాళ్ళు మాత్రమే కరెంట్ పోల్స్ ఎక్కి విద్యుత్ సరఫరా అంతరాయాలను రిపేర్ చేయగలరు అన్న భావన కు చెక్ పెడుతూ మేము ఎందుకు చేయలేమని సవాల్ విసురుతూ లైన్ ఉమెన్ గా అర్హత సాధించింది.

జూనియర్ లైన్ ఉమన్ గా శిరీష .. నియామక పత్రాన్ని అందించిన మంత్రి జగదీశ్ రెడ్డి


తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL)లో జూనియర్ లైన్ మెన్ (JLM)గా నియమితులైన మొదటి మహిళగా బబ్బూరి శిరీష చరిత్ర సృష్టించింది. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఇంధన శాఖ మంత్రి జి జగదీశ్‌రెడ్డి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. సిద్దిపేట జిల్లాకు చెందిన శిరీష మేడ్చల్ మల్కాజిగిరిలో తన చదువును అభ్యసించింది. టిఎస్ఎస్పిడిసిఎల్ లో జేఎల్ఎం పోస్టుల కోసం ఇటీవల జరిగిన రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగాన్ని పొందిన ఏకైక మహిళ శిరీష. రాష్ట్రంలోని రెండు విద్యుత్తు పంపిణీ సంస్థల్లో కూడా ఆమె ఒక్కరే పదవిలో ఉన్నారు.

దేశంలోనే మహిళలకి ఈ పోస్టులను ఇచ్చిన ఘనత తెలంగాణా ప్రభుత్వానిదే : లైన్ ఉమన్ శిరీష


తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లో జూనియర్ లైన్ మెన్ పోస్ట్‌కి ఎంపికైన మొదటి మహిళ శిరీష కావడం గర్వకారణం. స్త్రీలు పురుషుల కంటే తక్కువేమీ కాదని, అన్ని రంగాల్లో రాణించగలరని ఈ పదవికి తన ఎంపిక నిరూపిస్తోందని ఆమె చెబుతున్నారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రఘుమారెడ్డికి, కంపెనీకి ధన్యవాదాలు అని శిరీష తెలిపారు. దేశంలోనే మహిళలకి ఈ పోస్టులను ఇచ్చిన ఘనత తెలంగాణా ప్రభుత్వానిదే అని శిరీష పేర్కొన్నారు . నా పని ద్వారా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థ గర్వపడేలా చేస్తాను" అని శిరీష పేర్కొన్నారు. ఇక మగవాళ్ళకు దీటుగా ఎంతో చాకచక్యంగా కరెంట్ పోల్స్ ఎక్కుతున్న శిరీష వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహిళలకు అవకాశం .. లైన్ మెన్ పోస్టుల పేరు మారుస్తామన్న మంత్రి

మహిళలకు అవకాశం .. లైన్ మెన్ పోస్టుల పేరు మారుస్తామన్న మంత్రి


జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ శాఖలో మహిళలు కొత్త బాటలో పయనిస్తూ జేఎల్‌ఎం పోస్టులలో నియామకాలు చేపట్టడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. లైన్‌మెన్‌ పోస్టుల్లో మహిళలను కూడా నియమిస్తున్నందున గతంలో సూచించిన విధంగా లైన్‌మెన్‌ పోస్టుల నామకరణాన్ని మార్చి లింగభేదం లేకుండా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక శిరీషను మేడ్చల్ సర్కిల్ పరిధిలో జూనియర్ లైన్ మెన్ గా నియమించామని ఆయన వెల్లడించారు.

లైన్ మెన్ పోస్టులకు పోటీ పడిన అమ్మాయిలు.. కరెంట్ స్థంభం ఎక్కటంలో శిరీష సక్సెస్

లైన్ మెన్ పోస్టులకు పోటీ పడిన అమ్మాయిలు.. కరెంట్ స్థంభం ఎక్కటంలో శిరీష సక్సెస్


ఎస్‌పిడిసిఎల్‌లో 70 అసిస్టెంట్ ఇంజనీర్లు, 201 సబ్ ఇంజనీర్లు, 1,000 లైన్ మెన్ పోస్టుల భర్తీ ఇప్పటికే ప్రారంభమైంది. వివిధ పదవుల్లో మహిళలకు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ జారీచేసిన ఉద్యోగ నోటిఫికేషన్ లో లైన్ మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 38 మంది అమ్మాయిల లో 32 మంది రాత పరీక్ష రాశారు. వీరిలో 11 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇద్దరు మాత్రమే కరెంటు స్తంభం ఎక్కే పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. వీరిద్దరిలో ఒకరికి ఇటీవల ట్రాన్స్ కో లో ఉద్యోగం రాగా, శిరీష డిస్కం లో చేరారు. తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌ట్రాన్స్‌కో)లో జేఎల్‌ఎం పోస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 200 మంది మహిళలను నియమించింది.

English summary
With the appointment of Sirisha as the first line woman to climb the current poles, the impression is created that women can do any work. Minister Jagadish Reddy presented the appointment letter to Sirisha as the first junior line woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X