వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్క నాటిన సోనూసూద్, ప్రతీ ఒక్కరు పాల్గొనాలని పిలుపు

|
Google Oneindia TeluguNews

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నటుడు సోనూ సూద్ స్వీకరించారు. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల విసిరిన ఛాలెంజ్ స్వీకరించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కను నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని.. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని సోనూ సూద్ కోరారు.

 గ్రీన్ ఇండియా ఛాలెంజ్..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్..

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని సోనూ సూద్ అన్నారు. కరోనా వైరస్ వల్ల.. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత మరింత పెరిగిందన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నొక్కి వక్కానించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో లక్షలాది మంది గ్రీన్ ఛాలెంజ్‌ స్వీకరించాలని సోనూ సూద్ ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.

 7 వేల మందికి సాయం..

7 వేల మందికి సాయం..

కరోనా వైరస్ సమయంలో పని లేక కూలీలు ఇబ్బంది పడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లేందుకు కూలీలు పడ్డా.. పాట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే ఆ సమయంలో సోనూ సూద్ రియల్ హీరోగా మారిపోయాడు. దాదాపు 7 వేలకు పైగా మందికి సాయం చేశారు. అయితే సోనూ సూద్ చేసిన మంచి పనిని పలువురు కొనియాడుతున్నారు. యు ఆర్ గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్.. సోనూ సూద్‌ను సన్మానించిన సంగతి తెలిసిందే.

సెట్స్‌లో సందడి..

సెట్స్‌లో సందడి..

అల్లుడు అదుర్స్ సెట్‌ సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలో సోనూ సూద్ అక్కడికి వచ్చారు. సోనూసూద్‌కు ప్రకాశ్ రాజ్ శాలువా కప్పి.. పుష్పగుచ్చం అందజేశారు. జ్ఞాపిక కూడా బహుకరించారు. సోనూ సూద్ రాకతో సెట్స్ వద్ద సందడి నెలకొంది. కష్ట సమయంలో సోనూ సూద్ ఆపన్నులకు అందజేసిన సాయాన్ని ప్రకాశ్ రాజ్ కొనియాడారు. సోనూసూద్‌ను మనస్ఫూర్తిగా ప్రకాశ్ రాజ్ అభినందించారు.

విదేశాల నుంచి విద్యార్థులు

విదేశాల నుంచి విద్యార్థులు

లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులు, పేదలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సోనూ సూద్ బస్సులు, రైళ్ల ద్వారా వలస కూలీలను స్వస్థలలాకు పంపించివేశారు. విదేశాల్లో ఉన్నవారి కోసం ప్రత్యేక విమానా ద్వారా స్వస్థలాలకు చేర్చారు. భారతీయు విద్యార్థులను కూడా స్వదేశానికి రప్పించారు. అడిగితే సాయం చేస్తూ అపర దానకర్ణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

English summary
sonu sood take green india challenge, planted at ramoji film city
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X