ఎర్ర పార్టీలను ఏకం చేసి కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తాం: తమ్మినేని వీరభద్రం
కరీంనగర్ : రాష్ట్రంలో సామాజిక న్యాయసాధన కోసం ఎర్రజెండా పార్టీలను, ప్రజా సంఘాలను ఏకంచేసి పోరాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం, తెలంగాణ అభివృద్ధి నినాదంతో ఆయన చేపట్టిన మహాజన పాదయాత్ర గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంది.

ఈ సందర్బంగా స్థానిక తెలంగాణ చౌక్‌లో నిర్వహించిన బహిరంగ సభలో తమ్మినేని మ్లాడుతూ... సీపీఎంను దిక్కులేని పార్టీ అంటూ అవహేళన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్‌కు సీపీఎం పార్టీ చుక్కలు చూపిస్తుందని సవాల్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం కేసీఆర్ ప్రజలను మాయమాటలతో తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మాటలకు భయపడేదిలేదని, భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాలు చేస్తామని తేల్చిచెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!