వాహనదారులకు అదిరిపోయే శుభవార్త.. మార్చి 23నుండి మీ సమయం, డబ్బు రెండూ ఆదా!
తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు శుభవార్త చెప్పింది తెలంగాణ రవాణా శాఖ. మార్చి 23వ తేదీ నుంచి రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ వాహనం పోర్టల్ ద్వారా జరుగుతుందని పేర్కొంది. దీనివల్ల వాహనదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
తెలంగాణా రవాణా శాఖ కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ తో అనుసంధానం
ప్రస్తుతం తెలంగాణ రవాణా శాఖ తమ సొంత ఐటీ వ్యవస్థ ద్వారా వాహనదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ తో అనుసంధానం చేయడం వల్ల రాష్ట్రంలోని వాహనాల వివరాలు జాతీయ డేటాబేస్ లోకి వెళ్తాయి. దీనివల్ల వాహనాలకు సంబంధించిన అన్ని సేవలు ఆన్లైన్ లోనే అందుబాటులోకి వస్తాయి.

రెండవ వాహనం కొనుగోలుపై అదనంగా విధించే రెండు శాతం లైఫ్ టాక్స్ రద్దు
ఆర్టిఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో వాహనాలకు సంబంధించిన పనులను పూర్తి చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ అనుసంధాన వాహన పోర్టల్ లోకి తెలంగాణ రవాణా శాఖ సేవల ప్రక్రియలు మారడం వల్ల ప్రజలు సులభంగా వాహన సేవలు పొందవచ్చని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెండవ వాహనం కొనుగోలుపై అదనంగా విధించే రెండు శాతం లైఫ్ టాక్స్ ను కూడా రద్దు చేస్తున్నారు.
జాతీయ పోర్టల్ తో అనుసంధానం వల్ల లాభమిదే
ఇది మధ్యతరగతి వాహనదారులకు భారీ ఆర్థిక ఊరటను ఇస్తుంది. 10లక్షల విలువైన కారును కొనుగోలు చేస్తే వారికి 20000 రూపాయలు ఆదా అవుతుంది. జాతీయ వాహన పోర్టల్ కు తెలంగాణ రాష్ట్ర రవాణా సేవలు మారడం వల్ల జాతీయ డేటాబేస్ తో మన రాష్ట్ర వాహనాల వివరాలు అనుసంధానం అవుతాయి. వివిధ రాష్ట్రాల్లో వాహన తనిఖీలు జరిగినప్పుడు లేదా వాహనాలను ఇతర రాష్ట్రాలకు విక్రయించినప్పుడు డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఈజీ అవుతుంది.
ఇంట్లో కూర్చునే ఆర్టీయే సేవలు పొందే అవకాశం
దీనివల్ల ఆర్సి డూప్లికేట్ కాపీ తీసుకోవడం, పేరు మార్పు చేసుకోవడం, అడ్రస్ మార్చుకోవడం, హైపోథికేషన్ తొలగింపు వంటి పనులు నేరుగా ఆన్లైన్లో ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు. ఒకటికంటే ఎక్కువ వాహనాలు అవసరమైన కుటుంబాలకు రెండవ వాహనంపై విధించే రెండు శాతం లైఫ్ టాక్స్ రద్దు చేయడం శుభవార్తగా చెప్పొచ్చు. జాతీయ వాహన పోర్టల్ తో తెలంగాణ రవాణా వ్యవస్థ అనుసంధానం కావడం రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో వాహనాలను కొనుగోలు చేసుకోవడానికి, మన వాహనాలను ఇతర రాష్ట్రాలకు విక్రయించడానికి కూడా ప్రక్రియను సులభతరం చేస్తుంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications