మేడారం జాతర ప్రసాదంపై టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త!
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పనులు వేగవంతంగా సాగుతున్నాయి గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈ సంవత్సరం మూడుకోట్ల వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎవరికీ ఇబ్బంది కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించేలాగా సకల ఏర్పాట్లను చేస్తున్నారు. మంత్రులు మేడారంలోని తిష్ట వేసి పనులలో వేగం పెంచి సమయానికి పనులు పూర్తి చేసేలా చూస్తున్నారు.
మేడారం జాతరకు వెళ్లలేనివారికి ఆర్టీసీ శుభవార్త
ఇప్పటికే మేడారం జాతరకు భక్తులు తరలి వెళ్తున్నారు. జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారన్న అభిప్రాయంతో ఇప్పటి నుంచే మేడారం జాతరకు భక్తులు వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. జాతర సమయంలో మేడారం వెళ్లడానికి ఇబ్బంది పడే భక్తుల కోసం భక్తుల మనోభావాలను గౌరవిస్తూ వారి కోరుకున్న చోటికి అమ్మవార్ల ప్రసాదాన్ని పంపించేందుకు tsrtc ప్రత్యేక సేవలను నిర్వహించనుంది.

tsrtc లాజిస్టిక్స్ విభాగం ప్రత్యేక ఏర్పాట్లు
మేడారం వెళ్లలేని భక్తులకు అందించేందుకు tsrtc లాజిస్టిక్స్ విభాగం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తుంది. జాతర్లకు వెళ్లలేక పోయే భక్తులు నిరాశ చెందకుండా ఉండేందుకు దేవాదాయ శాఖ సహకారంతో ఆర్టీసీ ఈ వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చింది. మేడారం వెళ్లలేని భక్తులు 299 రూపాయలు చెల్లించి ఈ సేవలను వినియోగించుకోవచ్చు.
మేడారం అమ్మవార్ల ప్రసాదం ఇంటి వద్దకే
ఈ మొత్తానికి ప్రసాదం ప్యాకెట్ తో పాటు, అమ్మవార్ల ఫోటో, పసుపు, కుంకుమ, బంగారం (బెల్లం) తో కూడిన కిట్ ను టి జి ఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సిబ్బంది భక్తుల ఇంటి వద్దకే సురక్షితంగా డెలివరీ చేస్తారు. ఆసక్తి ఉన్న భక్తులు www. tgsrtclogistics.co.in వెబ్సైట్లో ఆన్లైన్లో ప్రసాదం బుక్ చేసుకోవచ్చు. లేదా టీ జి ఎస్ ఆర్ టి సి లాజిస్టిక్స్ కౌంటర్లలో నేరుగా ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు.
సదవకాశం.. సద్వినియోగం చేసుకుంటే మంచిది
మరిన్ని వివరాలు సందేహాల నివృత్తి కోసం కాల్ సెంటర్ నెంబర్లు 040 69440069, 040 23450033 నంబర్లకు సంప్రదించవచ్చు. మేడారం వెళ్లలేకపోయిన భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ ద్వారా మేడారం అమ్మవార్ల ప్రసాదాన్ని పొందవచ్చు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications