హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూడాన్ నుంచి ఖత్ లీవ్స్: పట్టివేత (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. ఇందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు యెమన్‌కు చెందినవారు. గంజాయి ఆకులను (ఖత్ లీవ్స్)ను సేకరించి అమ్ముతున్నారనే ఆరోపణపై వారిని అరెస్టు చేశారు.

హైదరాబాదులోని లంగర్‌హౌస్‌లో పోలీసులు వారిని శుక్రవారంనాడు అరెస్టు చేశారు. వారి నుంచి పోలీసులు వంద బండిల్స్ ఖత్ లీవ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను యెమన్‌కు చెందిన మొహ్మద్ అహ్మద్ అబ్దుల్లా అబు మునసార్, హసన్ అలీ జెరేబ్‌లుగా, ముంబైకి చెందిన బన్సాత్ రహతేగా గుర్తించారు.

నిందితుల నుంచి పోలీసులు మూడు సెల్‌ఫోన్లు, కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డిసిపి లింబారెడ్డి, నార్త్ జోన్సిఐ ఆనంద్‌లతో కలిసి మీడియా సమావేశంలో తెలిపారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే కక్కుర్తితోనే వీరు ఈ పనికి ఒడిగట్టినట్లు తెలిపారు.

ముగ్గురి పట్టివేత

ముగ్గురి పట్టివేత

సూడాన్ నుంచి ముంబై మీదుగా హైదరాబాద్ తరలించి ఖత్ లీవ్స్‌ను విక్రయిస్తున్న ముగ్గురిని హైదరాబాద్ నార్తో జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

ముగ్గురి పట్టివేత

ముగ్గురి పట్టివేత

మెహిదీపట్నానికి చెందిన బిసిఎ విద్యార్థి మహ్మద్ అహ్మద్ అబ్దుల్లా, చేవెళ్ల లార్డ్ కాలేజీ బిసిఎ విద్యార్థి హసన్ అలీ స్నేహితులు. వారు ముంబైలోని అంధేరితానాకు చెందిన బన్సాత్‌తో పరిచయం పెంచుకుని ఖత్ లీవ్స్ అమ్మకం ప్రారంభించారు.

ముగ్గురి పట్టివేత

ముగ్గురి పట్టివేత

అబ్దుల్లా సరుకు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో పోలీసులు మరో ఇద్దరిని పట్టుకున్నారు.

ముగ్గురి పట్టివేత

ముగ్గురి పట్టివేత

ఇదివరలో కూడా ఈ ముగ్గురు ఇదే వ్యాపారం చేస్తూ పోలీసులకు చిక్కారు. ఇటీవల బెయిల్‌పై విడుదలై వచ్చారు.

English summary
he North Zone task force busted a drug racket and arrested three persons, including two people from Yemen, for procuring and selling Khat leaves at Langar Houz on Friday. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X