ప్రారంభమైన వింగ్స్ ఇండియా 2022 ఏవియేషన్ షో; నాలుగు రోజుల పాటు షెడ్యూల్ ఇదే!!
హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ వేడుక వింగ్స్ ఇండియా 2022 ఏవియేషన్ షో గురువారం ప్రారంభమైంది. భాగ్యనగరం వేదికగా ఎయిర్ షో నిర్వహించటానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసి వింగ్స్ ఇండియా 2022ని ప్రారంభించారు. ఈ షో ద్వారా దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, హెలికాఫ్టర్లు, జెట్ ఫైటర్లు హైదరాబాద్ నగర వాసులకు కనువిందు చేయనున్నాయి. ఎప్పుడెప్పుడా అని భాగ్యనగర వాసులు ఎదురు చూసిన విమానాలు ఆకాశంలో చక్కర్లు కొడుతూ చూపరులను ఆకట్టుకోనున్నాయి.

హైదరాబాద్ లో మొదలైన విమానాల పండుగ
హైదరాబాద్ వేదికగా నిర్వహించే ఈ విమానాల పండుగకు బేగంపేట ఎయిర్ పోర్టు రెడీ అయ్యింది. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. బేగంపేట విమానాశ్రయంలో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా ఏవియేషన్ షో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ ఎయిర్ షో వేదికగా అనేక కీలక సమావేశాలు జరగనున్నాయి.

వింగ్స్ ఇండియా 2022 ప్రారంభం .. కార్యక్రమానికి మంత్రి జ్యోతిరాదిత్యసింధియా
దేశవిదేశాలకు చెందిన విమానాల ప్రదర్శనతో పాటు, వ్యాపార వాణిజ్య ఒప్పందాలు, పాలసీ తీర్మానాలు, రీజినల్ కనెక్టివిటీ సదస్సులు, ఎయిర్ షో విన్యాసాలు ఈ ఏవియేషన్ ప్రదర్శనలో భాగంగా జరగనున్నాయి. నగరానికి చెందిన ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వింగ్స్ ఇండియా నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ కార్యక్రమానికి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తో పాటు కేంద్రమంత్రి వి.కె.సింగ్ కూడా హాజరు కానున్నారు.

తొలి రెండు రోజులు వ్యాపార కార్యాకలాపాలు
కరోనా మహమ్మారి కారణంగా నాలుగు ఏళ్ళ విరామం తర్వాత ఈ ఎయిర్ షో ను నిర్వహిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. బేగంపేట ఎయిర్పోర్టులో నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో దాదాపు 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. అదే విధంగా ఆరు వేలకు పైగా ట్రేడ్ విజిటర్స్, 50 వేల మంది సందర్శకులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం కేవలం బిజినెస్ మీట్ కే పరిమితం అయిన ఈ ఏవియేషన్ షో ఈసారి పూర్తి స్థాయిలో హైదరాబాద్ వాసులను ఆకట్టుకోనుంది. తొలి రెండు రోజులు వ్యాపార కార్యకలాపాలకు కేటాయించారు. గురు శుక్ర వారాల్లో బీ టు బీ మీటింగ్స్, విమానయాన రంగ భవిష్యత్తు పై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు.

చివరి రెండు రోజులు సాధారణ పౌరులకు అనుమతి
చివరి రెండు రోజులు సాధారణ ప్రజలకు వింగ్స్ ఇండియా 2002 ఏవియేషన్ షో చూడడానికి అనుమతిస్తారు. ఈ విమానాల ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించాలి అనుకునేవారు వింగ్స్ఇండియా వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈసారి సమ్మిట్ ప్రధానంగా హెలికాప్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, ఎమ్మార్వో పాలసీ, ఫ్లయింగ్ ట్రాకింగ్ ఆర్గనైజేషన్ పాలసీలపై ఫోకస్ చేయనున్నట్లుగా సమాచారం. ఇక ప్రదర్శన చివరి రోజు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏవియేషన్ కంపెనీలు, సంస్థలకు అవార్డులను అందజేస్తారు.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications