వెండి ధరలపై రాబర్ట్ కియోసాకి షాకింగ్ వ్యాఖ్యలు.. కొనుగోలుదారుల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు..
అంతర్జాతీయంగా, దేశీయంగా వెండి ధరలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నడూ లేని గరిష్ట స్థాయిలను తాకుతూ పెట్టుబడుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బంగారం తర్వాత అత్యంత కీలక విలువైన లోహంగా భావించే వెండి ఇప్పుడు పెట్టుబడుల మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే బంగారం, వెండి వంటి హార్డ్ అసెట్లపై పెట్టుబడులను బలంగా ప్రోత్సహించే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి చేసిన తాజా వ్యాఖ్యలు సామాన్యులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
రాబర్ట్ కియోసాకి గత కొన్నేళ్లుగా ప్రభుత్వాల అధిక రుణాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఫియాట్ కరెన్సీల విలువ క్షీణతపై తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా silver ధర రేపు ఔన్స్‌కు 100 డాలర్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమై, ఆ తర్వాత ఆల్‌టైమ్ హైలను నమోదు చేస్తుంది అంటూ తన 'ఎక్స్' (మునుపటి ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో పాటుగా దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అంటూ యూజర్లను చర్చకు ఆహ్వానించారు.

ఈ ట్వీట్ వెలువడిన వెంటనే పెట్టుబడిదారులు, ట్రేడర్లు, మార్కెట్ నిపుణుల మధ్య విస్తృత చర్చ మొదలైంది. కొందరు కియోసాకి మాటలను భవిష్యత్ ఆర్థిక సంక్షోభాలపై హెచ్చరికగా చూస్తుండగా, మరికొందరు దీన్ని అతిశయోక్తిగా అభివర్ణిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వెండి వంటి ప్రపంచవ్యాప్తంగా లిక్విడ్‌గా ట్రేడయ్యే కమోడిటీ ధర ఒక్కరోజులో 100 డాలర్లకు చేరుకోవాలంటే సాధారణ మార్కెట్ పరిస్థితులు సరిపోవు. భారీ ఆర్థిక మాంద్యం, గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలో పెద్ద కుదుపు లేదా వెండి సరఫరాలో తీవ్రమైన అంతరాయం వంటి అసాధారణ పరిస్థితులు ఏర్పడితేనే అటువంటి దూకుడు సాధ్యమవుతుందని వారు చెబుతున్నారు.
అయితే, కియోసాకి వ్యాఖ్యలను తక్షణ ధర అంచనాలుగా కాకుండా దీర్ఘకాలిక ఆర్థిక ప్రమాదాలపై హెచ్చరికగా చూడాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆయన గతంలో కూడా బిట్‌కాయిన్, బంగారం, వెండి ధరలపై పెద్ద అంచనాలు చేశారు. కొన్ని సందర్భాల్లో అవి కొంతవరకు నిజమయ్యాయని అభిమానులు చెబుతుంటే, మరికొన్ని అంచనాలు అమలుకాలేదని విమర్శకులు గుర్తుచేస్తున్నారు.
బంగారం ధరలు భారీగా పెరిగాయి.. పసిడి ప్రియుల కొంపలు ముంచిన అమెరికా దాడి.. జనవరి 5, సోమవారం ధరలు ఇవే..
కియోసాకి ప్రధానంగా చెప్పేది ఏంటంటే.. ఫియాట్ కరెన్సీలపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరం. ప్రభుత్వాలు అధికంగా నోట్లు ముద్రించడం వల్ల కరెన్సీ విలువ తగ్గిపోతుందని, అటువంటి పరిస్థితుల్లో బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి పరిమిత సరఫరా ఉన్న ఆస్తులే నిజమైన రక్షణగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ కోణంలో చూస్తే, వెండి ధర 100 డాలర్లకు చేరుతుందన్న ఆయన వ్యాఖ్య ఒక రోజు,అలాగే ఒక వారం అంచనాగా కాకుండా రాబోయే కాలంలో సంభవించవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.
Credit: Goodreturns
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications